పనాజీ: గోవా రాజకీయల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2027లో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) కీలక నిర్ణయం తీసుకుంది. గోవా ఫస్ట్ పేరుతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూటమిని ప్రకటించారు. రాష్ట్రంలో తమ కూటమిని ప్రకటిస్తూ, గోవా ఫార్వర్డ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మధ్య కూటమి పొత్తు కుదిరిందని ఆదివారం నాడు తెలిపారు. ఇది గోవా ప్రజలకు ఓ ప్రత్యామ్నాయం అందిస్తుందని పేర్కొన్నారు.

The Goa Forward Party and the Aam Aadmi Party have come together to form “Goa First”, an alliance to give the people of Goa a real alternative.

The people of Goa have been cheated twice. They won’t be cheated a third time. BJP and Congress may fight during elections, but behind… pic.twitter.com/XSmFdscGq5

— AAP (@AamAadmiParty) September 13, 2026

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ, గణేశ చతుర్థి సందర్భంగా గోవా ప్రజలకు ఒక మంచి వార్త చెప్పబోతున్నాం. ఏ శుభకార్యం చేసినా వినాయకుడి పేరుతో మొదలుపెట్టాలని పెద్దలు చెబుతుంటారు. కనుక గణేశ చతుర్థి కంటే మంచి అవకాశం మరొకటి ఉండదు. ఈ రోజు మేం గోవాలో గోవా ఫార్వర్డ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కూటమిగా ఏర్పాటయ్యాయని ప్రకటిస్తున్నాం. ఆ కూటమి పేరు గోవా ఫస్ట్.

ఈ కూటమిని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? గోవా ఫస్ట్ లాంటి కూటమిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గత కొన్ని సంవత్సరాలుగా గోవా ప్రజలు చూస్తూనే ఉన్నారు. గోవా ప్రజల ఓపిక నశించింది. అయితే కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపిస్తారు, లేదా బీజేపీకి అధికారం అందిస్తారు. ఈ రెండు పార్టీల మధ్య ఒక కూటమి నడుస్తోంది. 2017లో బీజేపీతో విసిగిపోయి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారు. కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను పంపి అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిందని’ కేజ్రీవాల్ ఆరోపించారు.

గోవా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్-బీజేపీ

కేజ్రీవాల్ మాట్లాడుతూ.. '2022లో మళ్లీ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి కావాల్సిన సభ్యులను అందించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించింది. ఈ విధంగా గోవా ప్రజలు రెండుసార్లు మోసపోయారు. ఇప్పుడు మూడోసారి మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. ఒకవైపు కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది. ప్రజలు బీజేపీతో విసిగి కాంగ్రెస్‌కు ఓటేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ ఎమ్మెల్యేలను బీజేపీకి పంపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయిస్తుంది. మరోవైపు బీజేపీ ప్రజలను మోసం చేస్తోంది.

కాంగ్రెస్ వాళ్లు ఇలా, అలా అని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను బీజేపీ నేతలు బాగా తిడతారు. ఆ తర్వాత అదే కాంగ్రెస్‌తో కలిసి బీజేపీ నేతలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. బీజేపీ ప్రభుత్వంలో సగానికి పైగా కాంగ్రెస్ నుంచి నెగ్గిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలు పరస్పరం చేతులు కలిపి ప్రజలను మోసం చేస్తున్నాయి. వారికి లోపల ప్రేమ, మమకారం ఉన్నాయి. మరోవైపు డీల్, సెట్టింగ్ ఉన్నాయి. ఫలితం ఏంటంటే మీకు ఓట్లు వేసిన గోవా ప్రజలు బాధపడుతున్నారు'

గోవా ఫార్వర్డ్ పార్టీ ముఖ్య విషయాలు
25 జనవరి 2016న స్థాపించిన గోవా ఫార్వర్డ్ పార్టీ గోవాకు చెందిన ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ అని తెలిసిందే. దీనికి విజయ్ సర్దేశాయ్ అధినేతగా ఉన్నారు. జీఎఫ్‌పీ 2017లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులను బరిలోకి దింపి, 3 స్థానాలను గెలుచుకుంది. 2017లో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడంలో ఈ పార్టీ కీలక పాత్ర పోషించింది. ఈ పార్టీ ఎన్నికల గుర్తు కొబ్బరికాయ.