Arshdeep Singh Racist Comment on Tilak Varma: ఐపీఎల్‌ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌ మధ్య ధర్మశాలో కీలక మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్‌ ముంగించుకొని వస్తున్న తిలక్ వర్మను ఉద్దేశిస్తూ అర్ష్‌దీప్ కొన్ని కామెంట్స్ పాస్ చేశారు. సోషల్ మీడియా కోసం షూట్ చేసిన వీడియోలో ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

వివాదానికి కారణమైన మాటలు ఏంటీ?

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, అర్ష్‌దీప్ సింగ్ తిలక్‌వర్మను చూస్తూ, ఓయే అంధేరే, సన్‌స్క్రీన్ లాయా? (బ్లాక్‌గా ఉన్న వాడా సన్‌స్క్రీన్ రాసుకున్నావా) అని ప్రశ్నించాడు. తిలక్ వర్మ మొదట దీనిని పట్టించుకోనట్టు కనిపించినా అర్ష్‌దీప్ అంతటితో ఆగకుండా తన పక్కనే ఉన్న పంజాబ్ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ నమన్‌ ధీర్‌వైపు కెమెరా తిప్పారు. నమన్‌ను చూపిస్తూ ఇతను పంజాబ్ అసలైన నర్‌(కాంది/ అందం), నీ ముఖం చూసుకో" అన్నట్టు ఎగతాళి చేశాడు. దీనిక వర్మ అసౌకర్యంగా ఫీలవుతూనే నేను ఫాక్స్‌టైల్ సన్‌స్క్రీన్ వాడుతున్నాను అని బదులిచ్చాడు.

Arshdeep Singh looked straight at Tilak Varma and said:

“Oye Andhere, sunscreen lagaaya?”

The pain and discomfort on Tilak’s face said it all, He was visibly hurt and NOT impressed at all.

How can a “joke” cut so deep? This wasn’t banter, it was pure racial shade 😔 pic.twitter.com/86BbYv8wI9

— PitchTalks (@ThePitchTalks) May 14, 2026

అర్ష్‌దీప్‌పై నెటిజన్ల ఆగ్రహం

ఈ వీడియో బయటకు రాగానే సోషల్ మీడియా భగ్గుమంది. అర్ష్‌దీప్‌ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. చాలా మంది దీనిని సిగ్గుమాలిన చర్య అని, వర్ణ వివక్ష అని కామెంట్స్ చేస్తున్నారు.

సాయి సుదర్శన్‌పై అవే కామెంట్స్

సాయి సుదర్శన్‌పై కూడా అలాంటి కామెంట్స్ చేశారు. స్నాప్ చాట్ వీడియో షూట్ చేస్తూ సాయివైపు కెమెరా తిప్పాడు.. కెమెరాకు సాయి సరిగా కనిపించడం లేదంటూ కెమెరా లెన్స్ తుడి మళ్లీ షూట్ చేశాడు.

🚨 Arshdeep Singh passes racist remarks against Sai Sudarshan

During one of his cringe videos, Arshdeep panned the camera towards Sai and said, "Wait, let me clean my camera lens, it can't capture Sai. The camera is not able to capture Sai's lips in the video." pic.twitter.com/w0Z3cxdi6w

— Brutal Truth (@sarkarstix) May 14, 2026

అర్షదీప్ కామెంట్స్‌కు తిలక్ వర్మ ముఖంలో బాధ కనిపిస్తోందని జోక్స్ పేరుతో ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు పంజాబ్ అనే పదాన్ని వాడుతూ అర్ష్‌దీప్ చేసిన పనులు హద్దులు దాటుతున్నాయని విమర్శించారు. ఇలాంటి ప్రవర్తన కెరీర్‌ను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.

గతంలో వివాదాలు

అర్ష్‌దీప్ సింగ్ కేవం ఈ ఒక్క ఘటనతోనే కాదు. గతంలో చాలా వివాదాల్లో ఇరుక్కున్నాడు. గతంలో తన యూట్యూబ్ ఛానెల్ కోసం తీసిన వ్లాగ్‌లో యుజ్వేంద్ర చహల్ విమానంలో వేపింగ్ చేస్తూ కనిపించడం పెద్ద దుమారం రేపింది. దీని వల్ల బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. అర్ష్‌దీప్‌ వ్లాగ్‌లను నిషేధించింది.

ఇప్పుడు అర్ష్‌దీప్ చేసిన కామెంట్స్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ కిందకు వస్తే అతనికి భారీ జరిమానాతోపాటు కొన్ని మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశం ఉంది.