ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్

3 weeks ago 4
ARTICLE AD

అనకాపల్లి: అర్సెలర్ మిట్టల్, నిప్పన్ కంపెనీ లు సముక్తంగా నిర్మించనున్న అనకాపల్లి మెగా స్టీల్ ప్లాంట్ కు సోమవారం (మార్చి 23న) సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయబోతున్నారు. దీనికి కేంద్ర మంత్రి కుమారస్వామి  ముఖ్య అతిథిగా అటెండ్ కాబోతున్నారు. దాదాపు 60 వేల కోట్ల భారీ పెట్టుబడి తో  నిర్మించనున్న ఈ స్టీల్ ప్లాంట్ వల్ల  ఉత్తరాంధ్ర ముఖచిత్రం పూర్తిగా మారుతుందని  ఆ కంపెనీలు చెబుతున్నాయి.

అధునాతన టెక్నాలజీ, పర్యావరణహితమైన పద్ధతుల్లో  ఏటా లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయబోతున్నట్టు  వారు చెబుతున్నారు. దీనివల్ల 20,000 మందికి ప్రత్యక్షంగా, మరి కొన్ని వేల మందికి పరోక్షంగా  ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్లాంట్ పనులను 2029కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

నక్కపల్లిలో భారీ ఏర్పాట్లు : హోం మంత్రి పర్యవేక్షణ

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం లో జరుగబోతున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి  సంబందించిన అన్ని ఏర్పాట్లను గత మూడు రోజులుగా హోం మంత్రి అనిత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆమె సొంత నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమం కావడంతో  హోం మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  పలు దఫాలు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన ఆమె  రవాణా, మంచినీరు తదితర ఏర్పాట్లపై కూడా  దృష్టి పెట్టాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.

యువగళం పాదయాత్రలో ప్రైవేట్, ప్రభుత్వ, స్వయం ఉపాధి రంగాల ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. హామీ నెరవేర్చడంలో భాగంగా ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కృషితో అనకాపల్లి జిల్లాలో రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్… pic.twitter.com/Z4U6W60qh3
— Telugu Desam Party (@JaiTDP) March 22, 2026

సోమవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరుగుతుంది. అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పర్యటిస్తారు. స్టీల్ ప్లాంట్ అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం మధ్యాహ్నం నుండి నక్కపల్లి కు వెళతారు.

నక్కపల్లి స్టీల్ ప్లాంట్ విశేషాలు ఇవే

అర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ఇండియా నిర్మించే ఈ స్టీల్ ప్లాంట్ మొత్తం బడ్జెట్ 1,34,964కోట్లు. సుమారు 5465 ఎకరాల్లో నిర్మితమయ్యే ఈ ప్లాంట్ సామర్ధ్యం మొదటి దశ లో 7.5 MTPA.ఈ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా 316 ఎకరాల్లో 11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్ట్ ను కూడా నిర్మించనున్నారు . ఈ స్టీల్ ప్లాంట్ ను రెండు దశల్లో అభివృద్ధి చేస్తారు. రెండు దశలూ పూర్తయ్యాక ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కలిపి  లక్ష మంది వరకు ఉపాధి కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక వసతులు కల్పనకు  సంపూర్ణ సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్లాంట్ నేషనల్ హైవే 16 తో కలిపే 4లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.

Read Entire Article