AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. ఫైనల్ ఆన్సర్ కీ వచ్చేసింది

1 month ago 3
ARTICLE AD
<p>AP TET Results out |&nbsp;అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) తుది ఫలితాలను, ఫైనల్ ఆన్సర్ కీలను ఏపీ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఇటీవల కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ ప్రాథమిక కీ పై అభ్యర్థుల నుంచి స్వీకరించిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ సమగ్రంగా పరిశీలించిన అనంతరం టెట్ ఫైనల్ స్కోర్ కార్డులను వెబ్&zwnj;సైట్&zwnj;లో అందుబాటులో ఉంచారు. రాబోయే ఉపాధ్యాయ భర్తీ (DSC)లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాలు అభ్యర్థులకు ఎంతో కీలకంగా మారాయి.</p> <p>ఏపీ టెట్ అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్&zwnj;సైట్ (&nbsp; <a title="https://tet2dsc.apcfss.in/" href="https://tet2dsc.apcfss.in/" target="_self" rel="nofollow">https://tet2dsc.apcfss.in/</a> ) ను సందర్శించాలి. హోమ్&zwnj;పేజీలో కనిపించే క్యాండిడేట్ లాగిన్ (Candidate Login) ఆప్షన్&zwnj;ను ఎంచుకుని, మీ హాల్ టికెట్ నంబర్ లేదా యూజర్ నేమ్&zwnj;తో పాటు పాస్&zwnj;వర్డ్ (లేదా పుట్టిన తేదీ), &nbsp;క్యాప్చా కోడ్&zwnj;ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఒకవేళ లాగిన్ వివరాలు మర్చిపోతే, పేజీలోని రికవరీ ఆప్షన్ ద్వారా మీ నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చు.</p> <p>&nbsp;లాగిన్ అయిన తర్వాత డాష్&zwnj;బోర్డ్&zwnj;లో డౌన్&zwnj;లోడ్ మార్క్స్ మెమో లేదా స్కోర్ కార్డు లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి పేపర్-1, పేపర్-2 వివరాలతో కూడిన స్కోర్ కార్డును పీడీఎఫ్ రూపంలో డౌన్&zwnj;లోడ్ చేసుకోవాలి. కేటగిరీల వారీగా నిర్ణయించిన కటాఫ్ మార్కులను సాధించిన అభ్యర్థులు అర్హత పొందినట్లు నిర్ధారిస్తారు. ఈ మార్క్స్ మెమో హార్డ్ కాపీని ప్రింట్ తీసుకుని, రాబోయే డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలనీ అభ్యర్థులకు సూచించారు.</p>
Read Entire Article