నరసరావుపేట: పింఛన్ల పంపిణీలో కూటమి సర్కార్ దూకూడు ప్రదర్శిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం ఒకటో తేదీన ఫించన్లు ఇచ్చి అవ్వాతాతలు, మంచానికే పరిమితమైన వారికి ఇబ్బంది లేకుండా చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో నెలకు ఒకరోజు ముందే తరువాత నెల పింఛన్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. గత కొన్ని నెలలుగా ఇదే కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు, మంత్రులు సైతం పింఛన్ పంపిణీలో పాల్గొంటున్నారు.
ఈ 31న నరసరావుపేటకు సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 31న నరసరావుపేట మండలం యల్లమంద గ్రామానికి రానున్నారు. మంగళవారం ఉదయం 10.30కి చంద్రబాబు ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు యల్లమందకు చేరుకుంటారు. హెలిప్యాడ్‌ వద్ద సీఎం చంద్రబాబుకు కూటమి నేతలు, అధికారులు స్వాగతం పలుకుతారు. అనంతరం 11.20 గంటల నుంచి 11.40 వరకు సీఎం చంద్రబాబు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు (NTR Bharosa Pensions) గ్రామంలో అందజేస్తారు.
పింఛన్ లబ్దిదారులతో చంద్రబాబు మాటామంతీ
యల్లమంద గ్రామంలో కొందరు లబ్దిదారులకు చంద్రబాబు స్వయంగా పింఛన్ అందిస్తారు. అనంతరం 11.45 గంటలకు స్థానికంగా ఉన్న కోదండరామస్వామి దేవాలయాన్ని ఆయన అనంతరం 12 గంటల నుంచి 12.45 వరకు పింఛనుదారులు, యల్లమంద గ్రామస్థులతో చంద్రబాబు మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. తరువాత హెలిప్యాడ్‌ ప్రాంతంలో సీఎం భోజనం చేస్తారు. తరువాత 1.15 వరకు జిల్లా అధికారులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

Also Read: Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ