AP Municipal Election: ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధత ప్రక్రియ స్పీడందుకుంది. 12 నగరపాలక సంస్థలు, 29 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాను రూపొందించి, ప్రచురణ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రెండు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు. ఫారం-1 నోటీసుతో పాటు వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాలను సెప్టెంబర్ 22న ప్రకటించాలని నిర్ణయించారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీని అర్హత తేదీగా పరిగణించి, తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా ఈ లిస్ట్‌ను రూపొందించాలని సూచించారు. మొత్తం 17 నగర పాలక సంస్థలకు గాను విజయనగరం కార్పొరేషన్‌లో వార్డుల పునర్విభజన ప్రక్రియ ముందుగా పూర్తి చేయనున్నారు. దీంతో అక్కడ సెప్టెంబర్ 3 నాటికే ఓటర్ల లిస్ట్ ప్రచురణ పూర్తి చేయనున్నారు.

Also Read: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు

సెప్టెంబర్ 22న

రాష్ట్రంలోని 106 పురపాలక, నగర పంచాయతీల్లో డిలిమిటేషన్ పూర్తైన 58 చోట్ల సెప్టెంబరు 3నే ఓటర్ల జాబితాలను ప్రకటించారు. మిగిలిన 12 నగర పాలక సంస్థలు, 29 పురపాలక, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ సెప్టెంబరు 14 నుంచి 17 మధ్య పూర్తి చేయనున్నారు. దీంతో ఆయా చోట్ల ఓటర్ల లిస్టుల ప్రచురణకు కొత్త తేదీని ఖరారు చేయాలని పురపాలక శాఖ సెప్టెంబరు 13న ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎస్ఈసీ.. సెప్టెంబరు 22న ప్రచురణ తేదీగా ఖరారు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల లిస్టుల ప్రచురణతో ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ రెడీ అవుతోంది. మేయర్లు, పురపాలక ఛైర్మన్లు, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మార్గం సుగమం అవ్వనుంది. కార్పొరేషన్ కమిషనర్లు , మున్సిపల్ కమిషనర్లు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Also Read:  సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్

రాజకీయ పార్టీల్లో ఆసక్తి

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ స్పీడందుకోవడంతో ఇప్పటికే రాజకీయ పార్టీల్లో ఆసక్తి నెలకొంది. పురపాలక ఎన్నికలకు అవసరమైన పాలనా, ఎన్నికలపర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసేందుకు ఎస్ఈసీ చర్యలు ప్రారంభించింది. ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలపై ఎన్నికల సంఘం దృష్టి సారించనుంది. 12 నగరపాలక సంస్థలు, 29 పురపాలక సంఘాల్లో ఓటర్ల జాబితాల తయారీకి సంబంధించి తాజా నోటిఫికేషన్ల జారీతో పురపాలక ఎన్నికల ప్రక్రియకు ముందడుగు పడింది. ఈ నెల 22న వార్డుల వారీగా లిస్టులు ప్రచురించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ పార్టీల కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి.

Also Read: మాజీ మంత్రి ఆళ్ల నాని మృతిపై సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి.. ప్రముఖులు నివాళి