Nani Kayadu Lohar Anjaana Anjaani Song Lyrics In Telugu: 'ది ప్యారడైజ్'కు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 'ఆయా షేర్...' అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరితో స్టెప్పులు వేయించింది. గల్లీల నుంచి పబ్బుల వరకు అన్ని చోట్ల వినబడుతోంది. 'ఏష నాగుల...' సాంగ్ కూడా వైరల్ అయ్యింది. ఇప్పుడీ సినిమా నుంచి మంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్ వచ్చింది. అదే 'అంజానా అంజానీ'. ఆ సాంగ్ లిరిక్స్ మీ కోసం...

నాని, కయాదు మధ్య రొమాంటిక్ మెలోడీ
'ది ప్యారడైజ్'లో నాని సరసన సెన్సేషనల్ హీరోయిన్ కయాదు లోహర్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రచార చిత్రాల్లో రా అండ్ రస్టిక్ లుక్స్, విజువల్స్ ఎక్కువ హైలైట్ అయ్యాయి. ముందుగా విడుదల చేసిన సాంగ్స్ కూడా ఆ స్థాయిలో ఉన్నాయి. అయితే... సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య మంచి ప్రేమ పాట కూడా ఉంది. ఆ సాంగ్ 'అంజానా అంజానీ' లిరిక్స్ చూడండి.

పల్లవి
(హీరో - మేల్ వాయిస్)
నేను మళ్లీ పుట్టానే...
అంజానా అంజానీలా కలిశామంత జత
నువ్వు నేను అలా
ఏం జాదూ చేశావో
నా ఊపిరి లోనా నీ ఊసే చేరే ఇలా

విధ్వంసం నాదట పూ వర్షం నీదట
బీభత్సం హాయిగా తోచిందట
విస్ఫోటనం నేనట
అదృష్టం నీవట
నా దారే మెల్లగా మారిందట

(హీరోయిన్ - ఫిమేల్ వాయిస్)
నే మళ్లీ పుట్టానే!

చరణం
(హీరోయిన్ - ఫిమేల్ వాయిస్)
రగులుతున్నది సెగల మాదిరి
పొగరులో నీకై నాలో సడి
నలుగుతున్నది పెదవులే మరి
పలకటం ఎలా నీ పేరుని

(హీరో - మేల్)
ఎడారిలా తడిరిన నీ దేహమే
నా ధ్యేయని శరీరమా
స్మశానమా అనేట్లుగా మారాలని

(హీరోయిన్ - ఫిమేల్ వాయిస్)
సముద్రమైనా సలామనేలా
నీ ఆటుపోటు ఉండాలని
నా శ్వాస నాపే నీ పాటులోనే
నే చిక్కుకుంటా కావాలని

Also Read: Bomma Bomma Song Lyrics - బొమ్మ బొమ్మ లిరిక్స్... పూజా హెగ్డేతో దుల్కర్ రొమాంటిక్ మెలోడీ - 'శ్రీ శ్రీ' కోసం అనంత శ్రీరామ్ ఏం రాశారంటే?

ఇన్నాళ్లూ లేదిలా
ఇవ్వాళే కొత్తగా
నీ వెంటే ఊహలో బతికేస్తున్నా!

పల్లవి(హీరోయిన్ - ఫిమేల్ వాయిస్)
నేను మళ్లీ పుట్టానే!!
అంజానా అంజానీలా కలిశామంత జత
నువ్వు నేను అలా
ఏం జాదూ చేశావో
నా ఊపిరి లోనా నీ ఊసే చేరే ఇలా

Also Read: Chitti Chitti Cheema Song Lyrics - చిట్టి చిట్టి చీమ లిరిక్స్... దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' కోసం శ్రీమణి ఏం రాశారంటే?

'అంజనా అంజానీ' పాటకు కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సుభలాషిని ఆలపించారు. రొమాంటిక్ మెలోడీ కూడా వైరల్ అయ్యేలా ఉంది. 'దసరా' విజయం తర్వాత మరోసారి నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలిసి చేసిన సినిమా 'ది ప్యారడైజ్'. 'దసరా'ను నిర్మించిన ఎస్.ఎల్.వి సినిమాస్ అధినేత సుధాకర్ చెరుకూరి ఈ సినిమానూ ప్రొడ్యూస్ చేశారు. ఇందులో మోహన్ బాబు మెయిన్ విలన్ రోల్ చేశారు. బాలీవుడ్ నటీనటులు సోనాల్ కులకర్ణి, రాఘవ్ జూయల్ తదితరులు ఇతర పాత్రలు చేశారు.

Also Read: Kalatheylaa Song Lyrics - కలతేలా లిరిక్స్... మధ్యతరగతి భర్తకు మోటివేషన్ ఇచ్చేలా విశాల్ 'మకుటం'లో సాంగ్