పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి గోపాల్‌పూర్ (ఒడిశా)కు 220 కిమీ, పూరీకు 220 కిమీ, కళింగపట్నంకు 230 కిమీ, విశాఖపట్నానికి 320 కిమీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 6 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలోపేతం అవుతుంది. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజాము మధ్య విశాఖపట్నం- గోపాల్‌పూర్ మధ్య తీరాలను దాటే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో 2 రోజులపాటు శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

విశాఖపట్నం: పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి గోపాల్‌పూర్ (ఒడిశా)కు 220 కిమీ, పూరీకు 220 కిమీ, కళింగపట్నంకు 230 కిమీ, విశాఖపట్నానికి 320 కిమీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 6 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలోపేతం అవుతుంది. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజాము మధ్య విశాఖపట్నం- గోపాల్‌పూర్ మధ్య తీరాలను దాటే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో 2 రోజులపాటు శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

▪️ఇది రాబోయే 12 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలోపేతం

▪️రేపు రాత్రి, ఎల్లుండి తెల్లవారుజాము మధ్య విశాఖపట్నం- గోపాల్‌పూర్ మధ్య తీరాలను దాటే అవకాశం

▪️దీని ప్రభావంతో నేడు, రేపు శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్ష సూచన

— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) September 22, 2026

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీకాకుళంతో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి చెరువుల్లా కనిపిస్తున్నాయి. రోడ్లు రహదారులపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో తీర ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అత్యవసర విపత్తు నిర్వహణ దృష్ట్యా అధికారులందరూ తమ విధుల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అత్యవసర సాయం కోసం జిల్లా కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నందున కల్వర్టులు, పొంగిపొర్లుతున్న వంతెనల దాటే ప్రయత్నం ఎవరూ చేయవద్దని అందులో మునిగిపోయే, కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.