<p><strong>Hundreds of employees were fired from AP Fiber Net:</strong> ఏపీ ఫైబర్ నెట్ నుంచి జీతాలు తీసుకుని వైసీపీ నేతల ఇళ్లల్లో పనులు చేసిన <br />వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. దాదాపుగా 410 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లుగా ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. వీరంతా విద్యార్హతలు లేకపోయినా ఫైబర్ నెట్ లో చేయగలిగిన పనులు లేకపోయినప్పటికీ నియమించారని జీవీరెడ్డి తెలిపారు. కక్ష సాధింపుల కోసం వీరిని తీసేయలేదన్నారు. ఫైబర్ నెట్ పేరుతో అప్పులు తెచ్చి ఇలా అవసరం లేకపోయినా ఉద్యోగుల్ని నియమించి.. ఇతర ఖర్చులు చేసి దివాలా స్థితికి తెచ్చారని మండిపడ్డారు. రామ్ గోపాల్ వర్మరు రూ. కోటి పదిహేను లక్షలు చెల్లించారన్నారు. ఇంకా పనులు లేకుండా ఉన్న వారు రెండు వందల మందికిపైగా ఉన్నారని వారిని కూడా త్వరలో తీసేస్తామన్నారు. </p>