90's ప్రేక్షకులకు 'అనకొండ' సినిమా ఒక మరిచిపోలేని జ్ఞాపకం. అంతవరకూ మనకు పెద్దగా తెలియని 'అనకొండ' పాము గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసేలా చేసింది అ మూవీ. 1997లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అంటే హాలీవుడ్ సినిమాలు ప్రాంతీయ భాషల్లోకి డబ్ చేయడం ఈ సినిమా తో బాగా ఊపందుకుంది. అదే ఏడాది వచ్చిన 'టైటానిక్', 'జూరాసిక్ పార్క్ 2' కూడా సూపర్ హిట్ అవడంతో ఆ తరువాత వచ్చిన ప్రతీ హాలీవుడ్ క్రేజీ మూవీ తెలుగులోకి డబ్ చేయడం మొదలైంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు? అంటే సినిమా ప్రియుల్లో కల్ట్ స్టేటస్ పొందిన 'అనకొండ' మూవీని మళ్ళీ రీమేక్ చేశారు. ఈ డిసెంబర్‌లో విడుదల కాబోతున్న కొత్త 'అనకొండ' ట్రైలర్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. అయితే అప్పటి పిల్లల్ని బాగా భయపెట్టిన 'అనకొండ' మూవీకి కామెడీ టచ్ ఇవ్వడం విశేషం.

లో బడ్జెట్‌లో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన 'అనకొండ'
45 మిలియన్ డాలర్లు అంటే 1997లో తక్కువ బడ్జెట్ గానే లెక్క. అదే ఏడాది 'టైటానిక్', 'జూరాసిక్ పార్క్ 2', 'టుమారో నెవర్ డైస్' (007), 'మెన్ ఇన్ బ్లాక్' లాంటి భారీ బడ్జెట్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటితో పోలిస్తే 'అనకొండ' బడ్జెట్ చాలా తక్కువ. ఈ సినిమాలో నటించిన వాళ్లలో 'జెనిఫర్ లోపేజ్'కి మాత్రమే అప్పటికి కాస్త క్రేజ్ ఉంది. అమెరికన్స్ కి తప్ప తూర్పు దేశాల ప్రజలకు 'అనకొండ' గురించి పెద్దగా తెలియదు. దానితో సినిమాకి పెద్దగా బడ్జెట్ పెట్టడానికి కొలంబియా సంస్థ ధైర్యం చేయలేదు. చాలా చర్చల తర్వాత ఈ సినిమా సెట్స్ కి వెళ్ళింది. అమెజాన్ అడవుల్లో ఒక అరుదైన తెగ ప్రజల గురించి డాక్యుమెంటరీ తీయడానికి వెళ్ళిన బృందం భయంకరమైన 'అనకొండ' పాముల దాడిలో చిక్కుకుపోవడం వాళ్ళని ఒక వేటగాడు మోసం చేయడం వంటి కథతో రూపొందిన ఈ సినిమాకి అప్పట్లో అన్నీ నెగిటివ్ రివ్యూలే వచ్చాయి. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. 45 మిలియన్ డాలర్ల తో తీసిన ఈ సినిమా ఏకంగా 136 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. సినిమాలో నటించిన వాళ్ళందరూ రాత్రికి రాత్రి స్టార్లు అయిపోయారు. ప్రస్తుతం 90స్ ఆడియన్స్ దృష్టిలో ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్.

ఆకట్టుకోని సీక్వెల్స్... ఫస్ట్ పార్ట్‌ అంత హిట్ కాదు!
'అనకొండ' సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకి మూడు సీక్వెల్స్ తీసింది హాలీవుడ్. అయితే అవేవీ మొదటి సినిమా స్థాయిలో హిట్ కాలేదు. అలాగే 'లేక్ ప్లేసిడ్' సిరీస్‌తో 'అనకొండ'ను క్రాస్ ఓవర్ చేశారు. పోయిన ఏడాది చైనీస్ లో 'అనకొండ'ను రీమేక్ చేశారు. అవీ వర్క్ ఔట్ కాలేదు.

Also Read: మళ్ళీ మెగా పవర్ స్టారే... గ్లోబల్ స్టార్ ట్యాగ్ తీసేసిన రామ్ చరణ్!

కొత్తగా హాలీవుడ్‌లో అనకొండ రీ-బూట్... క్రిస్మస్‌ రిలీజ్!
మొదటి సినిమా తీసిన కొలంబియా పిక్చర్స్ మళ్లీ ఇన్నేళ్ళకు 'అనకొండ'ను రీ బూట్ చేస్తోంది. అయితే ఈసారి మంచి బడ్జెట్ నే కేటాయించింది. 'Ant man' సిరీస్ లో నటించిన పాల్ రూడ్, 'కింగ్ కాంగ్', 'జుమాంజి' సిరీస్ ల్లో నటించిన జాక్ బ్లాక్ లాంటి స్టార్స్ తో 'అనకొండ' రెడీ అయింది. అయితే ఈసారి సినిమా మొత్తం కామెడీ టచ్ తో రూపొందింది. పాత అనుకొండ సినిమాను రీమేక్ చేయడం కోసం అడవుల్లోకి వెళ్లిన ఒక బృందం అసలు అనకొండ పాముల బారిన పడే కథాంశంతో ఈ సినిమా రూపొందించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కామెడీ సీన్స్ వరకు బానే ఉన్నా 1997 నాటి " అనకొండ " లోని థ్రిల్, షాకింగ్ ఫ్యాక్టర్స్ ఈ సినిమా ఆడియన్స్ కు ఇస్తుందా లేదా తెలియాలంటే సినిమా రిలీజ్ డేట్ 25 డిసెంబర్ వరకూ ఆగాల్సిందే.

Also Read: 'హృదయపూర్వం' రివ్యూ: జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో మోహన్ లాల్ - The Raja Saab హీరోయిన్ మాళవికా మోహనన్ సినిమా