Ammayi garu Serial Today December 4th: హత్య చేసిన అశోక్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన రాజు...నిర్దోషిగా విడుదలైన ఎమ్మెల్యే విరూపాక్షి

1 day ago 1
ARTICLE AD
<p><strong>Ammayi garu Serial Today Episode:</strong> విరూపాక్షిని నిర్దోషిగా &nbsp;నిరూపించడానికి &nbsp;ఒక్క అవకాశం ఇవ్వాలని రూప కోరగా....జడ్జి 20నిమిషాలు సమయం ఇస్తాడు. ఈలోగా &nbsp;సాక్ష్యాలు,ఆధారాలు కోర్టు ముందు ఉంచాలని చెబుతాడు. ఇంతలో రాజు &nbsp;అశోక్&zwnj; కోసం తీవ్రంగా గాలిస్తుంటాడు. శేఖర్ చెప్పినట్లు &nbsp;సెల్&zwnj;ఫోన్ సిగ్నల్స్&zwnj; ట్రేస్ చేసుకుంటూ రాజు...అశోక్ ఉన్న ప్రాంతానికే వస్తాడు. అతని కోసం వెతుకుతుంటాడు. ఈలోగా &nbsp;కోర్టు ఆవరణలో అందరూ &nbsp;ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఇంతలో కోమలి &nbsp;కంగారుపడుతూ &nbsp;విజయాంబిక వద్దకు వచ్చి అశోక్ దొరికిపోయాడంటారా అని అడుగుతుంది.అశోక్ ఎట్టిపరిస్థితుల్లోనూ &nbsp;దొరికే ఛాన్స్ లేదని దీపక్ అంటాడు. నువ్వు కంగారుపడి భయపడితే &nbsp;మా మామయ్య చూస్తాడని &nbsp;హెచ్చరిస్తాడు.&nbsp;</p> <p>అండర్&zwnj;గ్రౌండ్&zwnj;లో దాక్కుని ఉన్న &nbsp;అశోక్&zwnj;ను వెతుక్కుంటూ రాజు అక్కడికి వస్తాడు. రాజును చూసి అశోక్&zwnj; &nbsp;ఒక్కసారిగా భయపడిపోతాడు. ఇక్కడ దాక్కుంటే ఎవరూ పట్టుకోలేరు అనుకున్నావా అంటాడు. నేను దాక్కోవడం ఎందుకు అని రెట్టించి అశోక్ సమాధానమిస్తాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు. చిట్&zwnj;ఫండ్ కంపెనీ మేనేజర్&zwnj;ను చంపినందుకు నిన్ను కోర్టుకు తీసుకెళ్లడానికే వచ్చానని...మర్యాదగా వస్తే మామూలుగా తీసుకెళ్తానని లేకుంటే తన్ని తీసుకెళ్తానని చెబుతాడు. ఇంతలో అశోక్&zwnj;....రాజును నెట్టేసి పారిపోతాడు. దీంతో రాజు అశోక్ వెంటపడి పట్టుకుంటాడు.</p> <p>&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;ఇంతలో కోర్టులో ప్రొసెడింగ్స్ తిరిగి ప్రారంభమవుతాయి. జడ్జి సాక్షిని ప్రవేశపెట్టాలని ఆదేశించగా...మరో 10 నిమిషాల సమయం ఇవ్వాలని రూప కోరుతుంది. సమయం మించి పోయిందని న్యాయమూర్తి అంటాడు. మీకు మళ్లీ సమయం ఇవ్వడం కుదరదని చెబుతాడు. ఈ కేసులో ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత విరూపాక్షి ఈ &nbsp;హత్య చేసినట్లు కోర్టు నమ్ముతుందని న్యాయమూర్తి అంటాడు. కాబట్టి ఆమెకు చట్టప్రకారం శిక్షిస్తామంటూ&nbsp; &nbsp;తీర్పు వెలువరించే సమయానికి &nbsp;రాజు...అశోక్&zwnj;ను తీసుకొచ్చికోర్టులో ఉంచుతాడు. అశోక్&zwnj;ను చూడగానే కోమలిలో భయం మొదలవ్వగా...విజయాంబిక, దీపక్&zwnj; బిక్కముఖం వేస్తారు. చిట్&zwnj;ఫండ్&zwnj; కంపెనీ మేనేజర్&zwnj;ను చంపింది వీడేనని చెప్పగా...నన్ను కొట్టి బెదిరించి ఈ నేరం ఒప్పుకోమన్నారంటూ అశోక్ జడ్జికి చెబుతాడు. ఆ చిట్&zwnj;ఫండ్&zwnj; కంపెనీ ఏంటో...ఆ మేనేజర్ ఎవరో కూడా నాకు తెలియదంటాడు. అతనే ఆ మేనేజర్&zwnj;ను చంపాడనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని లాయర్ రాజును నిలదీస్తాడు. సీసీ కెమెరా &nbsp;ఆధారాలన్నీ ధ్వంసం చేశారని....వాటిని రికవరీ చేస్తే అసలు వీడియో దొరికిందని రాజు చెబుతాడు. ఆ వీడియోను జడ్జికి అందిస్తాడు. అందులో స్పష్టంగా అశోక్&zwnj; మేనేజర్&zwnj;ను చంపుతున్న వీడియో ఉంటుంది. విరూపాక్షి &nbsp;గన్&zwnj;లో నుంచి బుల్లెట్ దొంగలించి &nbsp;దానితో మేనేజర్&zwnj;ను అశోక్ చంపాడని చెబుతాడు. ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత విరూపాక్షిని కోర్టు నిర్దోషిగా విడుదల చేస్తుంది. అలాగే హత్య చేసిన అశోక్&zwnj;ను పోలీసు కస్టడీలోక తీసుకోవాల్సిందిగా &nbsp;ఆదేశిస్తారు. దీంతో కోమలి తీవ్ర ఆందోళన చెందుతుంది. అటు విజయాంబిక,దీపక్&zwnj; కూడా తీవ్రంగా కంగారుపడతారు.అశోక్&zwnj;కు ఏమైనా జరిగితే మాదే బాధ్యత అన్న విజయాంబిక, దీపక్&zwnj; వైపు కోమలి చూస్తుంది. వాళ్లు ఆమెను చూసి నీళ్లు నములుతుంటారు.ఇప్పుడు మన పేర్లు బయటకు రాకుండా ఉంటే చాలు అనుకుంటారు.&nbsp;</p>
Read Entire Article