అమ్మ రాజశేఖర్ ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు కూడా అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన తన వారసుడిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. 'తల' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీకి స్వయంగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే తెరపైకి రాబోతున్న ఈ మూవీ ఈవెంట్లో అమ్మ రాజశేఖర్ స్పృహ తప్పి పడిపోయారు.

స్పృహ తప్పి పడిపోయిన అమ్మ రాజశేఖర్
దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా, అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త మూవీ 'తల'. అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ ఈ మూవీతో చిత్ర పరిశ్రమలోకి నటుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో అంకిత నస్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రోహిత్, ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఎస్తేర్ నోరాన్హ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్యామ్ కే నాయుడు ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అందించగా, ధర్మ తేజ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ మూవీ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలోకి రాబోతోంది.

ఈ నేపథ్యంలోనే మేకర్స్ 'తల' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి డైరెక్టర్ విఎన్ ఆదిత్య గెస్ట్ గా హాజరయ్యారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగానే అమ్మ రాజశేఖర్ స్పృహ తప్పి పడిపోవడంతో, కాసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడున్న వారు వెంటనే ఆయన వద్దకు చేరుకొని, సపర్యలు చేయడంతో అమ్మ రాజశేఖర్ కాసేపటికి తిరిగి నార్మల్ అయ్యారు. ప్రస్తుతం అమ్మ రాజశేఖర్ ఈవెంట్ లో స్పృహ తప్పి పడిపోయిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Also Read: ప్రతీసారి తగ్గను... నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు - విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్

దర్శకుడిగా అమ్మ రాజశేఖర్ జర్నీ
ఇదిలా ఉండగా, అమ్మ రాజశేఖర్ తన తల్లి మీద ప్రేమతో 'అమ్మ' అనే పదాన్ని పేరుకు ముందు పెట్టుకున్నారు. కొరియోగ్రాఫర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మారారు. 2006లో గోపీచంద్ తో అమ్మ రాజశేఖర్ తెరకెక్కించిన 'రణం' మూవీ ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఓవైపు కొరియోగ్రాఫర్ గా, చేస్తూనే మరోవైపు డైరెక్టర్ గా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. 'రణం' తర్వాత రవితేజతో 'ఖతర్నాక్' అనే సినిమాను చేశారు అమ్మ రాజశేఖర్. కానీ ఈ మూవీ ఆశించిన విధంగా సక్సెస్ కాలేదు. ఇక కొరియోగ్రాఫర్, డైరెక్టర్ గానే కాదు హీరో గానూ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు అమ్మ రాజశేఖర్. అలాగే బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో సీజన్ 4లో 11వ కంటెస్టెంట్ గా అమ్మ రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చారు. చాలా కాలం గ్యాప్ తర్వాత తన కొడుకుని హీరోగా పెట్టి 'తల' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్.

Also Read: సౌత్ క్వీన్ త్రిషను టార్గెట్ చేసిన హ్యాకర్లు... క్రిప్టో కరెన్సీ పోస్టులపై అభిమానులను అలర్ట్ చేసిన హీరోయిన్