Amaravati Farmers Plot Allotment: రాజ‌ధాని రైతుల‌కు గుడ్‌న్యూస్.. మలి విడత ప్లాట్ల కేటాయింపుపై CRDA కీలక ప్రకటన

4 months ago 16
ARTICLE AD
<p>అమరావతి: ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు శుభవార్త అందించింది. రాజధాని అమరావతి ప్రాంత రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఈనెల 29వ తేదీన రెండో విడత ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా రాజధానిలో ప్రధానమైన సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు ఈ విడతలో ప్లాట్లను కేటాయించనున్నారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, ఈ ప్రక్రియ మొత్తాన్ని ఈ-లాటరీ (E-Lottery) విధానం ద్వారా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.</p> <p>ముందుగా నిర్ణయించిన నిబంధనల ప్రకారం, లాటరీ పద్ధతిలో అర్హులైన రైతులకు ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) అధికారులు స్పష్టం చేశారు. అయితే, గతంలో ఈ లాటరీని ఈనెల 28వ తేదీన నిర్వహించాలని భావించినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల దీనిని 29వ తేదీకి మార్చినట్లు సీఆర్డీఏ వెల్లడించింది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.</p>
Read Entire Article