Alia Bhatt's Spy Action Thriller Alpha OTT Release Date Locked : బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' (Alpha). స్పై యూనివర్స్‌లో భాగంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జులై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో ఆగస్ట్ 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. మూవీకి శివ్ రావైల్ దర్శకత్వం వహించగా... ఆలియాభట్‌తో పాటు శర్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. ఉదయ్ చోప్రా స్టోరీ అందించగా... యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు.

Also Read : Anasuya Bharadwaj : భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో