Eluru News Today | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన 56 సంవత్సరాల వయసులోనే గుండెపోటుతో దూరమవ్వడం బాధాకరం అన్నారు. ఆళ్ల నాని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆళ్ల నాని గారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గారి (కాళీ కృష్ణ శ్రీనివాస్) హఠాన్మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 56 సంవత్సరాల వయసులోనే గుండెపోటుతో ఆయన దూరమవ్వడం బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఆళ్ల నాని గారి ఆత్మకు శాంతిని… pic.twitter.com/IlA7QrLDXP

— N Chandrababu Naidu (@ncbn) September 15, 2026

ఆళ్లనాని ఆకస్మిక మృతిపై వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మృతి తనను కలచివేసిందన్నారు. మాజీ మంత్రి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా దేవుడ్ని ప్రార్థించారు. వైసీపీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఆళ్లనాని చేసిన సేవల్ని గుర్తుచేసుకున్నారు.

ఆళ్లనాని గారి ఆకస్మిక మృతిపై వైయస్‌.జగన్‌ గారు దిగ్భ్రాంతి, ప్రగాఢ సానుభూతి

మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ శాసనసభ్యుడు, టీడీపీ నాయకుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) గారి మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మృతి తనను… pic.twitter.com/rExFHOND2i

— YSR Congress Party (@YSRCParty) September 15, 2026

వివాదాలకు దూరంగా ఉండే మంచి నేత: నారా లోకేష్

టీడీపీ నేత, మాజీ మంత్రి ఆళ్ల నాని గుండెపోటుతో మృతి చెందారని తెలియడంతో మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా, అందరితోనూ స్నేహపూర్వకంగా మెలిగే ఆళ్ల నానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఆళ్ల నాని ఆత్మకు శాంతి చేకూరాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) హఠాన్మరణం తనను ఎంతో బాధించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 3 సార్లు ఏలూరు శాసనసభ్యునిగా, ఒకసారి ఎమ్మెల్సీగా ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి ఆళ్ల నాని. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించిన పవన్ కళ్యాణ్.. ఆళ్ల నాని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.