Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజు డిజిటల్ బంగారం కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదిగో శుభసమయం!
1 month ago 6
ARTICLE AD
Akshaya Tritiya 2026: హిందూ మతంలో అక్షయ తృతీయను అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఈ ప్రత్యేక సందర్భంలో బంగారం కొనడానికి విశేష ప్రాముఖ్యత ఉంది. అక్షయ తృతీయ నాడు చేసిన పెట్టుబడులు వృధా కాకుండా శాశ్వత పుణ్యాన్ని తెస్తాయని నమ్ముతారు. అందువల్ల  ఈ రోజు బంగారం కొనడం శ్రేయస్సుకు ఆహ్వానంగా భావిస్తారు.
దృక్ పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 19, 2026 ఆదివారం నాడు వస్తుంది. ఈ తృతీయ తిథి ఏప్రిల్ 19న ఉదయం 10:45 గంటల నుంచి ఏప్రిల్ 20న ఉదయం 7:49 గంటల వరకు ఉంటుంది. రోజంతా శుభ సమయాలు , వివిధ యోగాలున్నాయి
అక్షయ తృతీయ డిజిటల్ గోల్డ్ షాపింగ్
డిజిటల్ బంగారం కొనుగోళ్లు భౌతికమైనవి కావు, అంటే కొనుగోలు చేసిన తర్వాత బంగారాన్ని మీరు ఉంచుకోలేరు లేదా ఇంటికి తీసుకురాలేరు. అందువల్ల, డిజిటల్ బంగారం కొనుగోలు చేయడానికి శుభ సమయం అవసరం లేదని చాలా మంది నమ్ముతారు. అయితే, ఇది నిజం కాదు. అక్షయ తృతీయ వంటి శుభ దినాలలో, మీరు ఏ రూపంలో బంగారం కొనుగోలు చేసినా, అది శుభ సమయమో కాదో తప్పకుండా చూసుకోండి. ఈ శుభ సమయంలో కొనుగోలు చేసిన బంగారం సంపదను కూడా పెంచుతుంది.
అక్షయ తృతీయ 2026 డిజిటల్ బంగారం కొనుగోలు ముహూర్తం
అక్షయ తృతీయ రోజున రోజంతా శుభ సమయమే. వాస్తవానికి ఈ రోజు ఏపని చేపట్టినా శుభ సమయాన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 10:49 నుంచి ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 7:49 వరకు ఉన్న ఈ 19 గంటల సమయంలో మీరు ఎప్పుడైనా కొనుగోళ్లు చేయవచ్చు. అయితే, బంగారం కొనుగోలు చేయడానికి అత్యంత శుభప్రదమైనవిగా పరిగణించే ఇతర శుభ సమయాలు కూడా ఉన్నాయి. అందువల్ల, అక్షయ తృతీయ రోజున ఈ శుభ సమయాల్లో మీరు డిజిటల్ బంగారాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు .
అభిజిత్ ముహూర్తం - ఏప్రిల్ 19, ఉదయం 11:55 నుంచి 12:46 వరకు
ఏప్రిల్ 19న ఉదయం 09:06 నుంచి 10:43 వరకు, (అమృత్ లాభ్) ఏప్రిల్ 19న ఉదయం 10:43 నుంచి మధ్యాహ్నం 12:20 వరకు మరియు (శుభ ముహూర్తం) ఏప్రిల్ 19న మధ్యాహ్నం 01:58 నుంచి 03:35 వరకు.
సాయంత్రం శుభ సమయం – ఏప్రిల్ 19వ తేదీ, సాయంత్రం 06:49 నుంచి 08:12 వరకు.
రాత్రి పూట శుభ సమయం - ఏప్రిల్ 19, రాత్రి 08:12 నుంచి 09:35 వరకు
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.  వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
Read Entire Article