Balakrishna's Akhanda 2 Ticket Rates Hike In Telangana : తెలంగాణలోనూ గాడ్ ఆఫ్ మాసెస్ 'అఖండ 2' టికెట్ రేట్స్‌ను ప్రభుత్వం పెంచింది. ధరల పెంపుతో పాటే ప్రీమియర్ షోలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఏపీలో 10 రోజులు పెంపు వర్తించనుండగా తెలంగాణలో మాత్రం కేవలం 3 రోజులే ఈ పెంపు వర్తించనుంది.

టికెట్ రేట్స్ ఎంతంటే?

'అఖండ 2' సింగిల్ స్క్రీన్లలో రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టీ ప్లెక్స్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి) చొప్పున పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, గురువారం రాత్రి 8 గంటలకు ప్రీమియర్ వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ప్రీమియర్ షో ధర రూ.600 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించింది. ఇక ఈ నెల 7 వరకూ మాత్రమే టికెట్ రేట్స్ పెంచుకోవచ్చు. ఆ తర్వాత యథావిధిగా టికెట్ రేట్స్ ఉండనున్నాయి.