Best Age Difference Between Couples : జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాల్లో పెళ్లి అనేది అతి ముఖ్యమైన, సెన్సిటివ్ విషయం. ఈ నిర్ణయాల్లో చిన్న తప్పు చేసినా.. లైఫ్ మీద పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరి జీవితాలను కలిపే ఈ బంధంలో ప్రేమ, అర్థం చేసుకోవడం, గౌరవం అనేవి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మరి వీటితో పాటు.. వయసు కూడా ఈ బాండింగ్కి ఎంతవరకు అవసరం? అసలు భార్యాభర్తల మధ్య వయస్సు ఎంత తేడా ఉంటే మంచిదో.. నిపుణుల అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం.

ఇండియన్ మ్యారేజ్ హిస్టరీలో భర్త భార్యకంటే కొంత పెద్దవాడిగా ఉంటారు. కానీ ఎంత వయసు తేడా ఉంటే హ్యాపీగా ఉంటారో.. పరిశోధనలు ఏమి చెబుతున్నాయో చూద్దాం.

5–7 సంవత్సరాల గ్యాప్

కొన్ని పరిశోధనల ప్రకారం.. భార్యాభర్తల మధ్య 5 నుంచి 7 సంవత్సరాల వయస్సు తేడా ఉండటం మంచిదిగా భావిస్తున్నారు. ఈ గ్యాప్ వల్ల ఇద్దరి మధ్య మెచ్యూరిటీ, అర్థం చేసుకోవడం కొంత బెటర్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వయస్సు తేడా ఎక్కువగా ఉంటే.. వారి అభిప్రాయాలు, జీవనశైలి, ఆసక్తులు పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉందని అన్నారు. దీని వల్ల కొన్నిసార్లు విభేదాలు రావచ్చని తెలిపారు.

పరిశోధనల ప్రకారం 25 ఏళ్ల లోపు ఉన్న మగవారు బాధ్యతలను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చని.. మహిళలు సాధారణంగా 21 ఏళ్లకే కొంత ఎక్కువ పరిణతిని చూపుతారని.. కాబట్టి వయసు తేడా కంటే మెచ్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు.

తక్కువ గ్యాప్ ఉంటే ఇబ్బందులు ఉంటాయా?

మిథునం మధ్య తక్కువ గ్యాప్.. అంటే 1–2 సంవత్సరాల గ్యాప్ ఉంటే కొన్ని సవాళ్లు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇద్దరూ ఒకే లైఫ్ స్టేజ్లో ఉంటారు. అలాగే వారి మధ్య ఈగో, పట్టుదల కూడా ఎక్కువగా ఉండొచ్చు. అలాగే చిన్న విషయాలకే గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట.

ఎక్కువ గ్యాప్ ఉంటే..

భార్య, భర్తల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటే.. పెద్దవారు కాస్త సహనంతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్నవారు గౌరవంతో వినే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడం సులభమవుతుంది. అలా అని ఇది ప్రతి జంటకు ఒకేలా ఉంటుందని చెప్పలేము.

మెచ్యూరిటీ ఉండాలి..

పెళ్లి మాత్రమే కాదు.. ఏ బంధంలో అయినా వయసు కంటే మెచ్యూరిటీ ముఖ్యపాత్ర పోషిస్తుంది. పరిణతి అనేది చాలా కీలకమైన అంశంగా చెప్తారు. ఎందుకంటే వయసు గ్యాప్ సరిపోయినా.. ఎక్కువగా ఉన్నా.. తక్కువగా ఉన్నా.. మెచ్యూరిటీ లేకుంటే ఆ బంధంలో గ్యాప్స్ వచ్చే అవకాశం ఉంది.

అలాగే వయస్సు ఎంతైనా సరే.. కామన్ ఇంట్రెస్ట్స్ ఉండటం చాలా ముఖ్యం. ప్రేమ, పరస్పర గౌరవం, అర్థం చేసుకోవడం, మంచి కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోవాలి. కలిసి సినిమాలు చూడటం, ట్రావెల్ చేయడం, ఫుడ్, హాబీస్ షేర్ చేసుకోవడం జరిగితే బాండింగ్ బాగా పెరుగుతుంది. ఇలాంటి చిన్న విషయాలే బంధాన్ని బలంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.