భారత ఆటోమొబైల్ మార్కెట్లో బెస్ట్ మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, ఫ్యూయల్ తక్కువ తీసుకునే అనేక CNG కార్లు లభిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే CNG కార్లు ఎక్కువ మైలేజీని ఇస్తాయని తెలిసిందే. ఈ కార్లలో జర్నీ చేయడం చౌక అని వీటికి డిమాండ్ పెరుగోతంది. అయితే 10 లక్షల రూపాయల కంటే తక్కువ బడ్జెట్‌లో లభించే టాప్ 5 బెస్ట్ CNG కార్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.

మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ (Maruti Swift CNG)

మారుతి స్విఫ్ట్ CNG భారత మార్కెట్లో కస్టమర్ల అత్యంత పొందిన హ్యాచ్‌బ్యాక్. ఈ సీఎన్‌జీ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.20 లక్షల నుండి రూ. 9.20 లక్షల వరకు ఉంటుంది. CNG మోడ్‌లో ఇది 32.85 కిమీ/ కేజీ మైలేజీని అందిస్తుంది. సేఫ్టీ విషయానికి వస్తే కారులో అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ లభిస్తాయి. ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇచ్చారు. స్టైలిష్ డిజైన్, బెస్ట్ పనితీరు కారణంగా ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది.

టాటా పంచ్ సీఎన్‌జీ (Tata Punch CNG)

ఒకవేళ మీరు ఈ విభాగంలో SUVని కొనుగోలు చేయాలని కోరుకుంటే Tata Punch CNG మీకు సరైన ఎంపిక అవుతుంది. టాటా పంచ్ సీఎన్‌జీ ధర రూ. 7.30 లక్షలకు ప్రారంభమై రూ. 10.17 లక్షల మధ్య ఉంటుంది. ARAI ప్రకారం ఇది 26.99 కి.మీ/ కేజీ మైలేజీని ఇస్తుంది. ఇందులో డ్యూయల్ సిలిండర్ CNG టెక్నాలజీ, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, స్ట్రాంగ్ బాడీ వంటి ఫీచర్లు ఉన్నాయి. మైక్రో SUV డిజైన్, సేఫ్టీ స్టాండర్డ్స్ దీనిని తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ SUVగా మలిచాయి.

మారుతి వాగన్ ఆర్ సీఎన్‌జీ (Maruti WagonR CNG)

భారత్‌లో అత్యధిక మైలేజీని ఇచ్చే మరియు అత్యధికంగా అమ్ముడయ్యే CNG కార్లలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (Wagon R) CNG ఒకటి. దీని ధర రూ. 6.69 లక్షలకు ప్రారంభం కాగా మోడల్ ను బట్టి రూ. 7.14 లక్షల వరకు ఉంటుంది. ఈ సీఎన్‌జీ కారు ఒక కేజీకి ఏకంగా 34.05 కి.మీ మైలేజీ ఇస్తుంది. రోజువారీ ప్రయాణికులకు (daily commuters) ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 1.0 లీటర్ K-సిరీస్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు, తక్కువ మెయింటెనెన్స్, మారుతికి ఉన్న మంచి సర్వీస్ నెట్‌వర్క్ కారణంగా మిడిల్ క్లాస్ వారికి ఫేవరెట్ ఆప్షన్‌గా నిలిచి విక్రయాల్లో దూసుకెళ్తోంది.

నిస్సాన్ మాగ్నైట్ సీఎన్‌జీ (Nissan Magnite CNG)

నిస్సాన్ మాగ్నైట్ CNG ఒక ప్రీమియం, స్టైలిష్ SUV. ఈ సీఎన్‌జీ కారు ధర రూ. 6.89 లక్షలకు ప్రారంభమవుతుంది. ఈ కారు 27.6 కిమీ/ కేజీ మైలేజీని ఇస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే నిస్సాన్ మాగ్నైట్ సీఎన్‌జీలో 360 డిగ్రీల కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. దీని స్టైలిష్ డిజైన్, నగదు తగ్గట్లుగా ఉండే ఫీచర్లు, పొజిషనింగ్ దీనిని ఈ కేటగిరీలో ప్రత్యేకంగా నిలిపాయి. అయితే, నిస్సాన్ సర్వీస్ నెట్‌వర్క్ తక్కువగా ఉండటం వల్ల చిన్న నగరాలలో కొంత ఇబ్బంది పడవచ్చు.