‘డెకాయిట్’ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో టీం ఉంది. తాజాగా నిర్వహించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌కు అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. మృణాళ్ గురించి అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి. తెలుగోడినే పెళ్లి చేసుకుని, ఇక్కడే సెటిల్ అవ్వమని మృణాళ్‌కి అల్లు అరవింద్ సలహా ఇచ్చారు. ఇక ఆ మాటలకు మృణాళ్ తెగ సిగ్గు పడిపోయింది. ఈ సక్సెస్ మీట్‌లో శేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

సుప్రియను పొగిడిన అడివి శేష్!
నిర్మాత సుప్రియ యార్లగడ్డ గురించి అడివి శేష్ గొప్పగా మాట్లాడాడు. ఆమె లేకపోతే డెకాయిట్ సినిమా ఈ రేంజ్‌లో వచ్చేది కాదని, ఆమె వల్లే ఈ చిత్రం ఇంత గొప్పగా, ఈ స్థాయిలో వచ్చిందని పొగిడేశాడు. ఈ సక్సెస్ మీట్‌లో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారని, అయినా వారందరి ముందు గర్వంగా చెప్పగలను.. సుప్రియ ది బెస్ట్ ప్రొడ్యూసర్ అని అడివి శేష్ అందరి ముందే ఓపెన్‌గా పొగిడేశాడు. సుప్రి.. ఈ సినిమాకెంతో ముఖ్యం.. నాకెంతో ముఖ్యం.. నేను చూసిన వారిలో నువ్వే బెస్ట్ ప్రొడ్యూసర్ అని అడివి శేష్ మాట్లాడిన మాటలకు సుప్రియ ఎమోషనల్ అయ్యారు.

Also Read: LIK Box Office Collection Day 2: ఫ్లాప్ టాక్‌తోనూ ప్రదీప్ రంగనాథన్ సినిమాకు వసూళ్లు... రెండో రోజు ‘లైక్’కి ఎంత వచ్చిందంటే?

ఇక సుప్రియ, అడివి శేష్ మధ్య ఏదో నడుస్తోందని, ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్నేళ్లుగా రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. గూఢచారి చిత్రంలో ఈ ఇద్దరూ కలిసి నటించారు. అప్పటి నుంచీ ఈ రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక మేజర్ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే చేయడంతో ఈ టాక్స్ మరింత ఎక్కువగా వినిపించాయి. ఇక డెకాయిట్ సినిమాకి సుప్రియ నిర్మాత అవ్వడం, అడివి శేష్ నటించడంతో ఈ రూమర్లు మరింత ఎక్కువ అయ్యాయి.

Also Read: Dacoit box office collection day 2: రెండవ రోజు పెరిగిన కలెక్షన్స్... బాక్సాఫీస్ వద్ద నిలకడగా ‘డెకాయిట్’ - ఎన్ని కోట్లు వచ్చాయంటే?

మరి వీటిపై అడివి శేష్ గానీ, సుప్రియ గానీ ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఈ డేటింగ్, ప్రేమ వార్తలకు వారిద్దరూ ఎప్పుడు పుల్ స్టాప్ పెడతారో చూడాలి. ‘డెకాయిట్’ అయితే మిక్స్డ్ టాక్ తెచ్చకున్నా.. కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపిస్తోంది. రెండు రోజుల్లోనే దాదాపు 25 నుంచి ముప్పై కోట్ల రేంజ్‌లో గ్రాస్ రాబట్టినట్టుగా సమాచారం. ఈ వీకెండ్‌‌కి కలెక్షన్ల పరంగా ‘డెకాయిట్’ ముందు వరుసలో ఉందని చెప్పొచ్చు.

Also Read: Ustaad Bhagat Singh OTT: ఈ వారమే ఓటీటీలో పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్'... స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫార్మ్‌ డీటెయిల్స్ తెల్సా?