AC Temperature in Summer : సమ్మర్‌లో AC ఎంతలో పెట్టాలి? 16లో పెడితే మంచిదా? నిపుణుల సూచనలివే
2 weeks ago 3
ARTICLE AD
Best AC Temperature for Health : వేసవికాలం మొదలైతే బయట వేడిని భరించలేక చాలా మంది ఏసీని ఉపయోగిస్తారు. వెంటనే వేడి తగ్గిపోవాలని.. చల్లగా ఉండాలని కొందరు ఏసీ టెంపరేచర్ 16°Cకి సెట్ చేస్తారు. రూమ్ ఎంత చల్లగా ఉంటే.. వేడి తగ్గి అంత బాగుంటుంది అనుకుంటారు. కానీ నిజంగా ఏసీని 16లో పెట్టడం మంచిదేనా? ఆరోగ్యానికి ఇబ్బందులు ఉంటాయా? సమ్మర్లో ఏసీని ఎంతలో పెట్టుకుంటే మంచిదో చూసేద్దాం.
16లో AC పెడితే..
సమ్మర్లో ఏసీని ఎంత టెంపరేచర్ పెట్టాలంటే..
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) ప్రకారం.. ఏసీని 24 వద్ద ఉంచడం ఉత్తమం. ఎందుకంటే ఇది శరీరానికి కంఫర్టబుల్ టెంపరేచర్. అలాగే ఇది విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యంపై ఒత్తిడి పడదని తెలిపింది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అతి చల్లని వాతావరణం శరీరానికి హానికరమని వెల్లడించింది. లేదంటే శ్వాసకోశ సమస్యలు పెరగడంతో పాటు.. గొంతు ఇన్ఫెక్షన్స్ రావడం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి జరుగుతాయని తెలిపింది.
ఏసీని బాగా తగ్గించి పెడితే వచ్చే సమస్యలు..
బాగా చల్లగా ఉండాలని.. ఏసీని ఎక్కువ డిగ్రీలు తగ్గించి పెట్టుకుంటే ఆరోగ్యానికి ఎన్నో సమస్యలు వస్తాయని అంటున్నారు. గొంతు ఎండిపోవడం నుంచి చర్మం డ్రై అవడం వరకు.. బ్రీతింగ్ సమస్యల నుంచి కండరాల నొప్పులు, నిద్ర సమస్యలు రావడం జరుగుతుంది.
ఏసీ వాడేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఏసీని ఉపయోగించాలనుకుంటే.. ఏసీ టెంపరేచర్ 24–25 మధ్య ఉంచండి. అలాగే మీకు చల్లదనం సరిపోవట్లేదు అనుకుంటే.. ఏసీని 24లో పెట్టి ఫ్యాన్ వేసుకోవచ్చు. దీనివల్ల గాలి సర్క్యులేట్ అయి.. రూమ్ చల్లగా మారుతుంది. రాత్రుళ్లు ఏసి వినియోగిస్తే టైమర్ వాడండి.
అలాగే చాలామంది ఏసీని వాడుతున్నామని గదిని పూర్తిగా మూసేస్తారు. కానీ అలా కాకుండా కొద్దిగా వెంటిలేషన్ ఉండేలా చూసేకోవాలని అంటున్నారు. అలాగే ఎక్కువసేపు ఏసీలో కూర్చోవద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే చల్లగా ఉంటే బాగుంటుంది కానీ అతి చల్లదనం ఆరోగ్యానికి మంచిది కాదు.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
Read Entire Article