ABP Network Southern Rising Summit 2025 | చెన్నైలో నేడు (నవంబర్ 25) ABP నెట్‌వర్క్ యొక్క ప్రతిష్టాత్మకమైన సౌత్ రైజింగ్ సమ్మిట్ 2025 ప్రారంభమైంది. ఇందులో రాజకీయాలు, విద్య, సాంకేతికత, సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఒకే వేదికపైకి రానున్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారతదేశ భవిష్యత్తు, విధానాలు, అభివృద్ధి, సామాజిక సమస్యలు, కొత్త అవకాశాలపై చర్చలు జరుగుతాయి.

కార్యక్రమం ABP నెట్‌వర్క్ డైరెక్టర్ ధ్రువ్ ముఖర్జీ స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. అనంతరం తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ 'గ్రోత్ విత్ ఈక్విటీ' అనే అంశంపై తమిళనాడు అభివృద్ధి విధానాలపై తన అభిప్రాయాలను పంచుకుంటారు. తమిళనాడు పాఠశాల విద్యా శాఖ మంత్రి అంబిల్ మహేష్ పొయ్యమోళి విద్యా సంస్కరణలపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. “భవిష్యత్తుకు సిద్ధం: ఆవిష్కరణ, పరివర్తన, స్ఫూర్తి” (Ready for the Future: Innovation, Transformation, Inspiration) అనే థీమ్‌తో ఈ ఏడాది సదరన్ రైజింగ్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు.

ప్రధాన సెషన్‌లో ఈ ప్రముఖులు

ప్రధాన సెషన్‌లో DMKకి చెందిన సేలం ధరణిధరన్, AIADMKకి చెందిన కోవై సత్యన్, బీజేపీకి చెందిన ఎస్.జి. సూర్య, తమిళనాడు కాంగ్రెస్కు చెందిన బెనెట్ ఆంటోనీ రాజు పాల్గొంటారు. వారు SIR ఎలక్టోరల్ రోల్‌కు సంబంధించిన వివాదంపై చర్చిస్తారు. మాజీ కేంద్ర ఆరోగ్య మంత్రి అంబుమణి రామదాస్, బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై మరియు కేరళ ప్రభుత్వ మంత్రి రాజేష్ ఎంబి తమతమ రంగాలపై ముఖ్యమైన అభిప్రాయాలను తెలియజేస్తారు

మధ్యాహ్నం నటి మాళవిక మోహనన్, IIT మద్రాస్ డైరెక్టర్ ప్రొ. వి. కామకోటి మరియు ABP ఎడ్యుకేషన్ CEO యష్ మెహతా సాంకేతికత, భాష మరియు విద్య యొక్క కొత్త కోణాలపై చర్చిస్తారు.

సాయంత్రం సెషన్ ప్రత్యేకం

సాయంత్రం సెషన్‌లో నేపథ్య గాయని కవితా కృష్ణమూర్తి, పరిశ్రమకు చెందిన ప్రీతిష్ వేధపుడ్డి, విమేష్ పి, ఎడి. పద్మసింగ్ ఇసాక్ పాల్గొంటారు. మహిళా సాధికారతపై దృష్టి సారించిన సెషన్‌లో కేరళకు చెందిన ఇద్దరు మహిళా క్రేన్ ఆపరేటర్లు - ననతానా మేరీ జె డి మరియు రెజితా ఆర్ ఎన్ తమ అనుభవాలను పంచుకుంటారు. ప్రముఖ స్టాండప్ కమెడియన్ శ్రద్ధా జైన్ (Aiiyo Shraddha) సెషన్‌తో కార్యక్రమం ముగుస్తుంది. ఇందులో ఆమె వైవిధ్యం, కళ ప్రాముఖ్యత గురించి మాట్లాడతారు.

సదరన్ రైజింగ్ సమ్మిట్ లైవ్ ఇలా వీక్షించండి

ABP న్యూస్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని www.abplive.com, abpdesam.com, news.abplive.com, abpnadu.com లో లైవ్ స్ట్రీమ్ చేస్తుంది. మీరు దీన్ని ABP న్యూస్ యూట్యూబ్ ఛానెల్ (https://www.youtube.com/channel/UCRWFSbif-RFENbBrSiez1DA)లో కూడా లైవ్ చూడవచ్చు.