Dulquer Salmaan's Aakasamlo Oka Tara Release Date : మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్స్‌తో టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా పవన్ సాదినేని దర్శకత్వం రాబోతోన్న ప్యాన్ ఇండిగా క్యూట్ లవ్ ఎంటర్టైనర్ 'ఆకాశంలో ఒక తార'. ఇప్పటికే ఈ మూవీ గ్లింప్స్, సాంగ్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ ఏడాది నవంబర్ 20న ఆకాశంలో ఒక తార మూవీ రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. 'నక్షత్రాల వైపు ప్రయాణం ప్రారంభం. రండి రండి మీ కోసం ఓ అందమైన ప్రపంచం వేచి ఉంది.' అంటూ దుల్కర్ సల్మాన్ కూల్ లుక్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతోంది. సున్నితమైన భావోద్వేగాలతో హృదయాలను హత్తుకునేలా ఆకాశంలో ఒక తార స్టోరీ ఉండబోతుందనేది గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. సామాన్య జీవితాల్లో కనిపించే క్యూట్ లవ్ స్టోరీ, అందమైన క్షణాలను అద్భుతంగా చూపించారు.

Also Read : Eshwar Sai Madhuri Rathod : ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?