8th Pay Commission Latest Update: ప్రస్తుతం 8వ వేతన సంఘం ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లింపులపై పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్ల తమ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. వివిధ ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని వేతనాలు, అలవెన్సులు, ఇతర పలు మార్పులను కోరుతున్నాయి. ఈ మేరకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అనేక సూచనలు కూడా చేశాయి. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే, గత కొన్ని సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విధానంలో ఇది అతిపెద్ద మార్పు అవుతుంది. 8వ వేతన సంఘం ఏం చేస్తుంది, వారి సిఫారసులతో ఉద్యోగులకు కలిగే బెనిఫిట్స్ తాజాగా అప్డేట్స్ ఇక్కడ తెలుసుకుందాం.

శాలరీ స్ట్రక్చర్‌లో మార్పు కోసం డిమాండ్

కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం 'ప్రగతిశీల శిక్షక్ న్యాయ మంచ్' (PSNM) వేతనాలు, అలవెన్సుల మొత్తం విధానంలో పలు మార్పులు చేయాలని డిమాండ్ చేసింది. టీచర్ల సంఘం తన ప్రతిపాదనలో లెవెల్ 1 ఉద్యోగులకు కనీస మూల వేతనం రూ. 50,000 నుండి రూ. 60,000 వరకు ఉండాలని కోరింది. ఇది ప్రస్తుత 7వ వేతన సంఘం కింద లభించే రూ. 18,000 బేసిక్ శాలరీ కంటే చాలా ఎక్కువ.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, ఇంక్రిమెంట్‌పై దృష్టి

ఉద్యోగ సంఘాల యూనియన్ ప్రస్తుత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 పెంచి 2.62 నుండి 3.83 వరకు చేయాలని సూచించింది. అలాగే, వార్షిక ఇంక్రిమెంట్ 3 శాతం నుండి దాదాపు 6-7 శాతం వరకు పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈ మార్పులు అవసరమని ఉద్యోగుల సంఘం చెబుతోంది. ఈ మార్పులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన భారీగా పెరుగుతుంది.

జీతం 4 రెట్లు పెంచాలని డిమాండ్

భారతీయ ప్రతిరక్షా మజ్దూర్ సంఘ్ (BPMS) కనీస ప్రాథమిక వేతనాన్ని (Basic Salry) దాదాపు రూ. 72,000కి పెంచాలని కేంద్రాన్ని, 8వ వేతన సంఘాన్ని డిమాండ్ చేసింది. ఇది ప్రస్తుత బేసిక్ శాలరీ కంటే 4 రెట్లు ఎక్కువ. దీనితో పాటు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 4కి పెంచాలని కూడా చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. టాప్ లెవెల్ పోస్టులకు గరిష్ట వేతనం రూ. 10 లక్షల వరకు ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ సూచనలను అంగీకరిస్తే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో భారీ పెరుగుదల సాధ్యమవుతుందనరి ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

కేంద్ర ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఫ్యాక్టర్

8వ వేతన సంఘం కింద ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉండవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 7వ వేతన సంఘం కింద కనీస ప్రాథమిక వేతనం రూ. 18,000. ఒకవేళ ప్రభుత్వం ఈసారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.86 శాతంగా నిర్ణయిస్తే.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 అయితే కనీస ప్రాథమిక వేతనం 18,000 రూపాయల నుండి నేరుగా 51,480 కు పెరుగుతుంది. దీని ప్రకారం బేసిక్ పే లో 186 శాతం భారీ పెరుగుదల నమోదు అవుతుంది.

అయితే, 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ లేదా 186 శాతం జీతం పెంపుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఉద్యోగ సంఘాలు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3 వద్ద ఉంచాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతా ఓకే అయితే కనుక కనీస వేతనం 54,000 వరకు వెళ్లే అవకాశం ఉంది.