5 Rupee Fish Meal: బెంగాల్‌లో రూ.5కే చేపల కూర భోజనం - సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం!
1 week ago 2
ARTICLE AD
Bengal 5 Rupee Fish Meal:   పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చేపల కూర ఎన్నికల సమయంలో హాట్ టాపిక్ అయింది.  ఇప్పుడు కూడా చేపలకూరను రాజకీయంగా హైలెట్ అవుతోంది.  పశ్చిమ బెంగాల్ సంస్కృతిలో అంతర్భాగమైన చేపను ఇప్పుడు రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారు ముఖ్యమంత్రి సువేందు అధికారి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 400 ప్రత్యేక క్యాంటీన్లలో కేవలం రూ.5లకే చేప కూరతో కూడిన భోజనాన్ని అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో టీఎంసీ ప్రభుత్వం నడిపిన మా క్యాంటీన్ల  తరహాలోనే, ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా వారానికి రెండు రోజులు చేపలను మెనూలో చేర్చారు. 
HUGE 🚨 Suvendu Adhikari’s Maa Kitchen is a superhit in Bengal 🔥
After the BJP came to power, it has been providing rice and fish curry for just ₹5.
During the polls, Mamata Banerjee falsely claimed that BJP is against fish 😭pic.twitter.com/vCGR6nvElD
 — News Algebra (@NewsAlgebraIND) May 23, 2026
 <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> కేవలం భోజనమే కాకుండా, మహిళా ఓటర్లను ఆకట్టుకున్న  అన్నపూర్ణ భండార్ గతంలో మాతృశక్తి భరోసా పథకం జూన్ 1 నుంచి అమలులోకి రానుంది. దీని కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.3,000 చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ప్రభుత్వంలోని  లక్ష్మీర్ భండార్ కంటే ఇది రెట్టింపు మొత్తం కావడంతో మహిళల్లో ఈ పథకంపై భారీ అంచనాలు ఉన్నాయి.  
"Fish-rice meals will be made available for ₹5 at 400 dedicated canteens across Bengal." - CM Suvendu Adhikari after an administrative review meeting at Kalyani pic.twitter.com/e3vCF9gxNU
 — Vinamra Koolwal (@NotKanjusBaniya) May 27, 2026
 <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> బడ్జెట్ భోజనంతో పాటు రాష్ట్రంలో విద్యా సంస్థలు, ప్రార్థనా స్థలాల సమీపంలో  ఒక కిలోమీటర్ మేర మద్యం విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.  సువేందు అధికారి తనదైన మార్కు రాజకీయాలతో బెంగాల్ ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుల భారం ఉన్నప్పటికీ, ఇలాంటి భారీ సంక్షేమ పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది వేచి చూడాలి. అయితే, ‘రూ.5  చేపల కూర భోజనం’ మాత్రం సామాన్యుడికి పెద్ద ఊరటనిచ్చే అంశమే.                                         
Read Entire Article