Sardar Owns 15 Rolls Royces: ఏదో సినిమాలో అయ్యగారు బయలుదేరే సమయానికి ఆయన వేసుకున్న డ్రెస్సుకు సూటయ్యే కారును ఆయన ముందు ఉంచుతారు పని మనుషులు. ఇది సినిమా కాదు కానీ నిజం. రూబెన్ సింగ్ గారు ఇలా డ్రెసప్ అయి ఇంటి బయటకు వచిన వెంటనే ఆయన తల పాగా ఏ కలర్‌ది పెట్టుకున్నారో ఆ కలర్ కారు ఆయన ముందు తెచ్చి పెడతారు డ్రైవర్లు. అది ఆషామాషీ లాంటి కార్లు కాదు. ఏకంగా రోల్స్ రాయిస్ కార్లే. పదిహేను రంగులతో తలపాగాలు ధరిస్తాడు రూబెన్ సింగ్. ఏ రోజు ఏ రంగు వేసుకుంటాడో ఆయనకు తెలియదు. తన తలపాగా ఉన్న కలర్ రోల్స్ కాయిస్ కారులోనే ఆఫీసుకు వెళ్లాలని అనుకుంటాడు. అందుకే పదిహేను రోల్స్ రాయిస్ కార్లు కొని పడేశాడు.

పదిహేను రోల్స్ రాయిస్ కార్ల ఓనర్ అయిన రూబెన్ సింగ్ ఉండేది ఇండియా కాదు. లండన్ లో . పంజాబీ కుటుంబంలో జన్మించిన ఆయన చిన్న వయసులోనే లండన్ వెళ్లిపోయారు. అక్కడ కొంత మంది ఆయన తలపాగాను చూసి ఎగతాళి చేశారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఆయన తన తలపాగాను గౌరవించేలా చేయాలనుకున్నారు. అందుకే పదిహేను రోల్స్ రాయిస్ కార్లను కొని .. తన తలపాగా ఏ కలర్ లో ఉంటే ఆ కలర్ రోల్స్ రాయిస్ లో తిరగడం ప్రారంభించారు.

Also Read: ఇక టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !

ఇరవై ఏళ్లకే వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగు పెట్టిన ఆయన మొదట డిజైన్ దుస్తుల వ్యాపారంలోకి వచ్చారు. తర్వాత రకరకాల వ్యాపారాల్లో అడుగుపెట్టారు. ఏఐ కంపెనీ కూడా పెట్టారు. ఇలా ఏ రంగంలో అడుగుపెట్టినా ఆద్భుతమైన విజయాలు సాధించారు. అందుకే ఆయనను బ్రిటన్ బిల్ గేట్స్ అంటారు. అయితే తనకు ఎదురైన అవమానాలను గౌరవంగా మార్చుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఎంత ఖర్చు అయినా రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేస్తూనే ఉన్నారు. మొత్తంగా పదిహేను రోల్స్ రాయిస్ కార్లు అంటే చిన్న విషయం కాదు. అత్యధునిక కొత్త మోడల్ ఏది వచ్చినా ఆయన గ్యారేజ్ లో ఉండాల్సిందే.

Also Read: గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్

సాధారణంగా రోల్స్ రాయిస్ కార్లను సమాజంలో పలుకుబడి ఉన్న వారికే అమ్ముతారు. రూబెన్ సింగ్ కు పదిహేను కార్లు అమ్మారంటే దానికి ఓ కారణం ఉంది. రూబెన్ సింగ్ .. బ్రిటన్ లో విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాదు ప్రభుత్వంతోనూ కలిసి పని చేశారు. ప్రభుత్వ విధానాల్లో ఆయన సలహాలు కూడా కీలక పాత్ర పోషిస్తూంటాయి.