14 inch wheel scooters India 2026: మన దేశంలో స్కూటర్ కొనుగోలు చేసే సమయంలో చాలా మంది మైలేజ్‌, ధర, ఫీచర్లతో పాటు వీల్ సైజ్ కూడా పరిశీలిస్తారు. ముఖ్యంగా, సాధారణ 12 అంగుళాల వీల్స్‌తో పోలిస్తే 14 అంగుళాల వీల్స్ ఉన్న స్కూటర్లు రోడ్డుపై మరింత స్థిరత్వం (Stability) & మెరుగైన హ్యాండ్లింగ్ అందిస్తాయి.

పెద్ద వీల్స్ ఉండటం వల్ల గుంతలు లేదా అసమానమైన రోడ్లపై కూడా స్కూటర్ కాస్త నమ్మకంగా నడుస్తుంది. ఇదే కారణంగా కొన్ని కంపెనీలు ఇప్పుడు 14-ఇంచ్ వీల్స్‌తో స్కూటర్లను తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యంత చౌక 14-ఇంచ్ వీల్ స్కూటర్లలో టాప్ 5 ఇవి.

5. River Indie - రూ.1.46 లక్షలు

ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎక్కువగా 12 అంగుళాల వీల్స్ ఉంటాయి. కానీ River Indie మాత్రం ముందు, వెనుక 14 అంగుళాల వీల్స్‌తో వస్తుంది.

ఇది పెద్ద వీల్స్ కారణంగా స్ట్రైట్ లైన్ స్టెబిలిటీ బాగా ఉంటుంది. రోడ్డు బాగోలేకపోయినా సులభంగా నడితే సామర్థ్యం కూడా ఉంటుంది. ఇండీ స్కూటర్ డిజైన్ కూడా బాక్సీగా ఉండటంతో పెద్ద వీల్స్ దానికి ప్రత్యేక లుక్ ఇస్తాయి.

అయితే పెద్ద వీల్స్ కారణంగా కొంచెం రోలింగ్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల రేంజ్‌పై స్వల్ప ప్రభావం ఉండొచ్చు.

4. Aprilia SR 125 / SR 175 - రూ.1.08 లక్షల నుంచి

Aprilia కంపెనీ 2016లో SR 150 మోడల్‌ను విడుదల చేసినప్పుడు 14-ఇంచ్ వీల్స్ స్కూటర్ సెగ్మెంట్‌లో చాలా అరుదుగా ఉండేవి. ఇప్పుడు SR 125 & SR 175 మోడళ్లు కూడా అదే కాన్సెప్ట్‌ను కొనసాగిస్తున్నాయి.

ఈ స్కూటర్లు స్పోర్టీ స్టైలింగ్‌తో పాటు 14-ఇంచ్ వీల్స్ కారణంగా మంచి హ్యాండ్లింగ్ ఇస్తాయి. రైడ్ కొంచెం ఫర్మ్‌గా అనిపించినా కార్నరింగ్‌లో మంచి స్టెబిలిటీ అందిస్తుంది.

3. Hero Xoom 160 - రూ.1.38 లక్షలు

హీరో కంపెనీ నుంచి వచ్చిన Xoom 160 భారత మార్కెట్‌లోని మ్యాక్సీ స్కూటర్ సెగ్మెంట్‌లో ముఖ్యమైన మోడల్. ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది.

బిగ్ బాడీ డిజైన్‌కు సరిపోయేలా 14-ఇంచ్ వీల్స్ ఇచ్చారు. అయితే పెద్ద వీల్స్ ఉన్నప్పటికీ మలుపుల్లో ఇది స్పోర్టీగా అనిపించకపోవచ్చని కొందరు రైడర్లు చెబుతున్నారు.

2. Yamaha Aerox 155 - రూ.1.40 లక్షల నుంచి

Yamaha Aerox 155 భారతదేశంలో అత్యంత పాపులర్ స్పోర్టీ స్కూటర్లలో ఒకటి. ఇది Yamaha R15లో ఉపయోగించే 155cc ఇంజిన్‌తో వస్తుంది.

ఈ మ్యాక్సీ స్కూటర్ కూడా 14-ఇంచ్ వీల్స్ కలిగి ఉండటం వల్ల హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. అయితే రైడ్ కొంచెం స్టిఫ్‌గా ‍‌(గట్టిగా) ఉండొచ్చు. అయినప్పటికీ స్పోర్టీ స్కూటర్ కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా భావిస్తారు.

1. Hero Xoom 125 - రూ.80,494 నుంచి

ఈ జాబితాలో అత్యంత చౌక స్కూటర్ Hero Xoom 125. 2024 చివర్లో విడుదలైన ఈ స్కూటర్ 124.6cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది.

ఇది ప్రస్తుతం భారత మార్కెట్‌లో 14-ఇంచ్ వీల్స్‌తో వచ్చే అత్యంత తక్కువ ధర స్కూటర్. పెద్ద వీల్స్ కారణంగా సాధారణ 12-ఇంచ్ వీల్స్ స్కూటర్లతో పోలిస్తే మెరుగైన స్థిరత్వం ఇస్తుంది.

ఈ మోడల్ ప్రధానంగా TVS Ntorq 125 వంటి స్కూటర్లకు పోటీగా నిలుస్తోంది. అయితే 14-ఇంచ్ వీల్స్ ఉండటం దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

Honourable Mention: TVS Orbiter - రూ.1,09,200

TVS కంపెనీ కొత్తగా తీసుకొచ్చిన Orbiter ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీనిలో ముందు 14-ఇంచ్ వీల్, వెనుక 12-ఇంచ్ వీల్ ఉంటుంది.

ముందు పెద్ద వీల్ ఉండటం వల్ల స్కూటర్‌కు స్టెబిలిటీ & ప్రత్యేక లుక్ లభిస్తుంది.

మొత్తానికి, పెద్ద వీల్స్ ఉన్న స్కూటర్లు రోడ్డు మీద మరింత స్థిరత్వం & మెరుగైన హ్యాండ్లింగ్ అందిస్తాయి. ప్రస్తుతం రూ.80 వేల నుంచే ప్రారంభమయ్యే Hero Xoom 125 వంటి మోడళ్లతో ఈ సెగ్మెంట్ మరింత ఆకర్షణీయంగా మారుతోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.