Honda Shine 125 Limited Edition Price And Features: భారత కమ్యూటర్‌ బైక్‌ సెగ్మెంట్‌లో హోండాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రోజువారీ ప్రయాణాలకు సరిపడే నమ్మకమైన మోడళ్లలో హోండా షైన్‌ 125 ముందు వరుసలో ఉంటుంది. ఇప్పుడు అదే షైన్‌ 125కి మరింత స్టైలిష్‌ టచ్‌ ఇస్తూ, హోండా షైన్‌ 125 లిమిటెడ్‌ ఎడిషన్‌ను అధికారికంగా లాంచ్‌ చేసింది. ఈ కొత్త వేరియంట్‌ ధర రూ.86,211 (ఎక్స్‌-షోరూమ్‌)గా కంపెనీ ప్రకటించింది.

లిమిటెడ్‌ ఎడిషన్‌లో ఏంటి కొత్తదనం?

షైన్‌ 125 లిమిటెడ్‌ ఎడిషన్‌ను డిస్క్‌ వేరియంట్‌ ఆధారంగా డిజైన్‌ చేశారు. సాధారణ మోడల్‌తో పోలిస్తే ఇది కేవలం రూ.1,000 ఎక్కువ ధర మాత్రమే ఉంటుంది. మెకానికల్‌ మార్పులు ఏమి లేకపోయినా, ఈ కాస్త ఎక్కువ ధరకే లుక్‌ విషయంలో కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు.

ఈ బైక్‌లో ప్రధానంగా కనిపించే మార్పు ఫ్యూయల్‌ ట్యాంక్‌పై కొత్త ‘Shine’ గ్రాఫిక్స్‌. ఇవి బైక్‌కు మరింత ప్రీమియం ఫీలింగ్‌ ఇస్తాయి. అదనంగా, పైరైట్‌ బ్రౌన్‌ రంగులో పెయింట్‌ చేసిన అలాయ్‌ వీల్స్‌ ఇవ్వడం ఈ ఎడిషన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

పెర్ల్‌ సైరెన్‌ బ్లూ కలర్‌ ఆప్షన్‌ సాధారణ షైన్‌లో కూడా ఉన్నప్పటికీ, లిమిటెడ్‌ ఎడిషన్‌లో ఈ రంగు మరింత ఆకట్టుకునేలా కనిపిస్తుంది. హెడ్‌ల్యాంప్‌ చుట్టూ క్రోమ్‌ ట్రిమ్‌, సైడ్‌ ప్యానెల్స్‌, ఎగ్జాస్ట్‌ కవర్‌ వంటి డిజైన్‌ అంశాలు మునుపటిలాగే కొనసాగించారు.

ఇంజిన్‌ & పనితీరు

ఇంజిన్‌ విషయంలో హోండా ఎలాంటి మార్పులు చేయలేదు. షైన్‌ 125 లిమిటెడ్‌ ఎడిషన్‌లో 124సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 10.6hp శక్తి, 11Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 5 స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో జత చేశారు. రోజువారీ ఆఫీస్‌ ప్రయాణాలు, నగరంలో ట్రాఫిక్‌లో సాఫీగా నడిపేందుకు ఇది సరైన సెటప్‌గా చెప్పొచ్చు.

ఫీచర్లు కూడా పుష్కలం

లిమిటెడ్‌ ఎడిషన్‌లో ఫీచర్లు కూడా డిస్క్‌ వేరియంట్‌లానే ఉన్నాయి. ఇందులో

ఫుల్‌ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌

సైడ్‌ స్టాండ్‌ ఇంజిన్‌ కట్‌ ఆఫ్‌

USB Type-C ఛార్జింగ్‌ పోర్ట్‌

లాంటివి స్టాండర్డ్‌గా లభిస్తాయి. ఈ ఫీచర్లు రోజువారీ వినియోగదారులకు బాగా ఉపయోగపడతాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న హోండా షైన్‌ 'డ్రమ్‌ వేరియంట్‌' ఆన్‌ రోడ్‌ ధరలు

విజయవాడలో ఆన్‌ రోడ్‌ ధర:

ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹82,317

RTO: ₹11,378

ఇన్సూరెన్స్‌ (కాంప్రహెన్షవ్‌): ₹6,672

మొత్తం ఆన్‌ రోడ్‌ ధర: ₹1,00,367

హైదరాబాద్‌లో ఆన్‌ రోడ్‌ ధర:

ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹81,675

RTO: ₹11,105

ఇన్సూరెన్స్‌ (కాంప్రహెన్షవ్‌): ₹7,298

TR: ₹995

ఎక్స్‌టెండెడ్‌ వారంటీ: ₹897

మొత్తం ఆన్‌ రోడ్‌ ధర: ₹1,01,970

హోండా షైన్‌ ఇప్పటికే తెలుగు మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే బైక్‌లలో ఒకటి. ఇప్పుడు వచ్చిన లిమిటెడ్‌ ఎడిషన్‌, అదే నమ్మకమైన పనితీరుతో పాటు కొంచెం ప్రీమియం లుక్‌ కోరుకునే వినియోగదారులకు మంచి ఎంపికగా మారనుంది. రోజువారీ ప్రయాణాలకు స్టైలిష్‌ కమ్యూటర్‌ బైక్‌ కావాలనుకునేవారు దీనిపై ఓసారి దృష్టి పెట్టొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.