స్టార్ హీరోకి అలాంటి త‌ప్పుడు అల‌వాటు

1 month ago 3
ARTICLE AD

ఇటీవ‌ల స‌ల్మాన్ ఖాన్ లోని హ్యుమానిటీ యాంగిల్ కంటే, అత‌డిలోని దుర‌ల‌వాట్ల గురించి చాలా చ‌ర్చ జ‌రుగుతోంది. స‌ల్మాన్ రాత్రి అంతా స్నేహితుల‌తో క‌లిసి పార్టీల్లో మునిగి తేల‌తాడ‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఇంత‌కుముందు ఓ ఇంట‌ర్వ్యూలో విమర్శించాడు. రాత్రి పార్టీల్లో మునిగి తేలే అత‌డు షూటింగుల‌కు కూడా ఆల‌స్యంగా వ‌స్తాడ‌ని కూడా కొంద‌రు వెల్ల‌డించారు.

అయితే స‌ల్మాన్ ఖాన్ ఓసారి నైట్ పార్టీ ముగిసాక తెల్ల‌వారు ఝామున త‌న పార్టీకి వ‌చ్చిన అతిథులంద‌రికీ గుర్రాల మేటింగ్ చూపించాడ‌ట‌. స‌ల్మాన్ త‌న ప‌న్వేల్ ఫామ్ హౌస్ లో ఇలాంటి దృశ్యం సిగ్గు లేకుండా చూపించాడ‌ని కొంద‌రు న‌టులు వ్యాఖ్యానించారు. అయితే తెలిసో తెలియ‌కో రైజింగ్ హీరో రాఘ‌వ్ జువ‌ల్ స‌ల్మాన్ లోని బ్యాడ్ హ్యాబిట్స్ గురించి తాజా ఇంట‌ర్వ్యూలో బ‌య‌ట‌పెట్టేసాడు. 

స‌ల్మాన్ ఖాన్ తో క‌లిసి కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో రాఘ‌వ్ జువ‌ల్ న‌టించాడు. స‌ల్మాన్ ఫామ్ హౌస్ లో డ‌ర్ట్ బైక్ ల విహారం గురించి కూడా రాఘ‌వ్ జువ‌ల్ తెలిపాడు.

Read Entire Article