2025 సెప్టెంబర్ 18 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu September 18th 2025

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు చాలా బాగుంటుంది. ఓ శుభవార్త వింటారు. ఆగిపోయిన పనులు ఈరోజు తిరిగి ప్రారంభిస్తారు. మీరు ఓ పనిపై సుదూర ప్రయాణం చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది.
శుభ సంఖ్య: 3
రంగు: ఎరుపు
పరిహారం: హనుమంతునికి బెల్లం సమర్పించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సీజనల్ వ్యాధుల బారిన పడటం వల్ల ఆరోగ్యం క్షీణించవచ్చు. పని రంగంలో, వ్యతిరేక వర్గం మీ పనికి ఆటంకం కలిగిస్తుంది. కుటుంబంలో అనుకోని వివాదాలుంటాయి

శుభ సంఖ్య: 6
రంగు: తెలుపు
పరిహారం: లక్ష్మీదేవికి పాయసం సమర్పించండి.

మిథున రాశి

మిథున రాశి వారు ఈ రోజు చాలా బిజీగా ఉంటారు. పని ఎక్కువ కారణంగా శారీరకంగా అలసటగా ఉంటుంది. వ్యాపారంలో ఈ రోజు మార్పులు చేయడం మీకు మంచిది కాదు. మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేయవచ్చు, ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు బాగా ఆలోచించండి. కుటుంబంలో ఎవరితోనైనా వివాదం ఏర్పడవచ్చు.

శుభ సంఖ్య: 5
రంగు: ఆకుపచ్చ
పరిహారం: తులసి మొక్కకు నీరు పోసి 11 సార్లు ప్రదక్షిణలు చేయండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు ఈ రోజు మీరు ఒక పెద్ద ఫంక్షన్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ రోజు మీకు మంచి రోజు, మీ మాటలను అదుపులో ఉంచుకుంటే చాలు. ఎలాంటి వివాదాల్లోనూ చిక్కుకోకండి. కుటుంబంలో పిల్లల చదువు గురించి కొంత ఆందోళన చెందుతారు, భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు.

శుభ సంఖ్య: 2
రంగు: సిల్వర్
పరిహారం: దుర్గామాతకు ఎర్రటి పూలు సమర్పించండి.

సింహ రాశి

సింహ రాశి వారు ఈరోజు సంతోషంగా ఉంటారు. ఓ శుభవార్త అందుతుంది. రోజంతా సంతోషంగా ఉంటారు.ఈ రోజు మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. కుటుంబ సమస్యలలో ఈ రోజు ఉపశమనం లభిస్తుంది. భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఈ రోజు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి.

శుభ సంఖ్య: 1
రంగు: బంగారు
పరిహారం: సూర్య భగవానుడికి నీటిలో ఎర్రటి పువ్వులు వేసి సమర్పించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారు ఈ రోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు దాని గురించి బాగా తెలుసుకోండి. ఎవరి మాట వినొద్దు. తప్పుడు సలహాల వల్ల నష్టపోతారు. కుటుంబంలో విభేదాలు ఈ రోజు తొలగిపోతాయి

శుభ సంఖ్య: 7
రంగు: ఆకుపచ్చ
పరిహారం: గణేశునికి దూర్వా సమర్పించండి.

తులా రాశి

తులా రాశి వారు ఈ రోజు మీరు ఏదైనా కొత్త వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే నెరవేరుతుంది. భాగస్వామి ఆస్తిలో పెద్ద పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసుకుంటారు. ఈ రోజు మీరు ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బును అప్పుగా ఇవ్వడం మీకు హానికరం. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి.

శుభ సంఖ్య: 6
రంగు: గులాబీ
పరిహారం: లక్ష్మీదేవికి తామర పువ్వు సమర్పించండి

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు పెద్ద ఉపశమనం కలిగించే రోజు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. సామాజిక-రాజకీయ రంగంలో మీ ఆధిపత్యం కొనసాగుతుంది. వ్యాపారంలో మీరు పెద్ద భాగస్వామ్యంలో భాగస్వామి కావచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉంటుంది.

శుభ సంఖ్య: 9
రంగు: ఎరుపు
పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి మరియు సింధూరం సమర్పించండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు ఈ రోజు మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ రోజు మీరు ఎక్కడి నుంచైనా పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందే అవకాసం ఉంది. పూర్వీకుల ఆస్తిలో ఈ రోజు మీకు మీ హక్కు లభిస్తుంది. కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించవచ్చు.

శుభ సంఖ్య: 3
రంగు: పసుపు
పరిహారం: గురువారం పేదలకు శనగపప్పు మరియు పసుపు దానం చేయండి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు గందరగోళంగా ఉంటుంది. కుటుంబ వివాదంలో చిక్కుకోవచ్చు. వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ఆందోళన ఉంటుంది. ఈ రోజు మీరు మీ భార్య పిల్లల గురించి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారు

శుభ సంఖ్య: 8
రంగు: నీలం
పరిహారం: శని దేవాలయంలో నూనె దీపం వెలిగించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారు ఈ రోజు మీరు ఏదైనా పాత వివాదంలో చిక్కుకునే ప్రమాదం ఉంది జాగ్రత్తపడండి...లేదంటే దీని కారణంగా చట్టపరమైన చిక్కుల్లో పడవచ్చు. ఈ రోజు వ్యాపారంలో, మీ ప్రత్యర్థులు మీ పనిని చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు. షేర్ మార్కెట్‌లో పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిదికాదు.

శుభ సంఖ్య: 4
రంగు: ఊదా
పరిహారం: రావి చెట్టుకు నీరు పోసి దీపం వెలిగించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీ వ్యాపారంలో పెద్ద లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడో ఆగిపోయిన పాత ధనం రావడం మీకు ఉపశమనాన్నిస్తుంది. వ్యాపారంలో పెద్ద భాగస్వామ్య ఒప్పందం కుదురుతుంది.. దీనివల్ల ఆర్థిక వనరులకు కొత్త మార్గాలు ఏర్పడతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి.

శుభ సంఖ్య: 7
రంగు: లేత నీలం
పరిహారం: శ్రీ మహావిష్ణువుకి పసుపు రంగు పువ్వులు సమర్పించండి.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.