Best Compact SUV Under 10 Lakh For City Driving: సిటీ డ్రైవింగ్‌కి సరిపోయే, తక్కువ ఖర్చు పెట్టించే, సులభంగా నడపగలిగే SUV కావాలనుకునే వారికి ₹10 లక్షల బడ్జెట్‌లో ఇప్పుడున్న చాలానే ఆప్షన్లు ఉన్నాయి. కానీ, వాటిలో బెస్ట్‌గా నిలుస్తున్నవి - Hyundai Exter, Maruti Fronx & Toyota Urban Cruiser Taisor.

Hyundai Exter - స్టైలిష్‌ అండ్‌ ప్రాక్టికల్‌
హ్యుందాయ్‌ బ్రాండ్‌ నుంచి వచ్చిన ఎక్స్‌టర్‌ 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో బలంగా పెర్ఫార్మ్‌ చేస్తుంది. ఇది 83 PS పవర్‌ & 113 Nm టార్క్‌ ఇస్తుంది. 5-స్పీడ్‌ మాన్యువల్‌ & AMT గేర్‌బాక్స్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మైలేజ్‌ విషయానికి వస్తే, లీటరుకు 19 km వరకు ఇస్తుంది. ఎక్స్‌టర్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌, రివర్స్‌ కెమెరా, ఆటో హెడ్‌ల్యాంప్స్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌టర్‌ ధరలు - ఎంట్రీ లెవెల్‌ EX వేరియంట్‌ నుంచి టాప్‌ మోడల్‌ SX(O) Connect వరకు - రూ. 6.13 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌) ఉన్నాయి.

Maruti Fronx & Toyota Taisor - ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ కింగ్స్‌
మారుతి ఫ్రాంక్స్‌ సిటీ యూజర్లకు పర్ఫెక్ట్‌ ఆప్షన్‌. 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో ఇది లీటరుకు 21 km వరకు మైలేజ్‌ ఇస్తుంది. దీనిలో CNG వెర్షన్‌ కూడా అందుబాటులో ఉండటం అదనపు ప్లస్‌ పాయింట్‌. డ్రైవింగ్‌లో లైట్‌గా, మెయింటెనెన్స్‌ తక్కువగా ఉండటం వల్ల, ఈ SUV బడ్జెట్‌ యూజర్లకు బెస్ట్‌ చాయిస్‌. డిజైన్‌ మోడ్రన్‌గా ఉండి, కాంపాక్ట్‌ సైజ్‌ కారణంగా ట్రాఫిక్‌లో తిప్పుకోవడం కూడా ఈజీ.

Toyota Urban Cruiser Taisor
టయోటా అర్బన్ క్రూయిజర్‌ టైజర్‌ను మారుతి ఫ్రాంక్స్‌ కి ట్విన్‌ వెర్షన్‌ అని చెప్పవచ్చు, సేమ్‌ ఫ్లాట్‌ఫామ్‌పై తయారైంది. అయితే, టయోటా బ్యాడ్జ్‌ క్వాలిటీతో వస్తుంది. టయోటా అర్బన్ క్రూయిజర్‌ టైజర్‌ రైడ్‌ క్వాలిటీ, కంఫర్ట్‌ అద్భుతంగా ఉంటాయి. వారంటీ సపోర్ట్‌ కూడా మెరుగ్గా ఉంది.

ఈ మూడింట్లో సిటీ యూజ్‌కి ఏ కారు బెస్ట్‌?
మీరు ఎక్కువగా ట్రాఫిక్‌ రోడ్లలో డ్రైవ్‌ చేస్తుంటే, మైలేజ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే... Fronx/Taisor మీకు ఉత్తమ ఎంపికలు, దేని ఏదైనా తీసుకోవచ్చు. వీటితో పోలిస్తే హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ కాస్త తక్కువ మైలేజ్‌ ఇస్తుంది. అయితే.. డిజైన్‌, సేఫ్టీ, ఫీచర్స్‌ కోరుకునే వాళ్లకు ఎక్స్‌టర్‌ బెస్ట్‌ చాయిస్‌.

ఒక నెలలో 500 కిలోమీటర్లకు మించి డ్రైవ్‌ చేయని వారికైతే పెట్రోల్‌ వేరియంట్స్‌ సరిపోతాయి. తక్కువ ఖర్చు పెట్టించే (తక్కువ మెయింటెనెన్స్‌, ఎక్కువ మైలేజ్‌) సిటీ SUV కొనాలనుకుంటే Toyota Urban Cruiser Taisor లేదా Maruti Fronx మీద మీ డబ్బును ఖర్చు పెట్టడం ఉత్తమం. ఇవి రెండూ ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ & తక్కువ మెయింటెనెన్స్‌ ఇస్తాయి. యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండి, సిటీ డ్రైవింగ్‌లో కంఫర్ట్‌ పరంగా ముందంజలో ఉన్నాయి.