సింగర్ కల్పన పరిస్థితి విషమం

9 months ago 7
ARTICLE AD

ప్రముఖ గాయని కల్పన నిన్న నిజాంపేట లోని ఓ గేటెడ్ హౌస్‌ లో ఆత్మహత్యయత్నం చెయ్యడం కలకలం సృష్టించింది. కొద్ది రోజులుగా డిప్రెషన్ లో ఉన్న ఆమె నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. రెండు రోజులుగా తలుపులు తెరవకపోవడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తలుపులు బద్దలు కొట్టి అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను పోలీసులు నిజాంపేటలో హోలిస్టిక్ ఆసుపత్రిలో జాయిన్ చేసారు. 

ప్రస్తుతం కల్పన పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంటిలేటర్ పై కల్పనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కల్పన భర్త చెన్నైలో ఉండగా ఆయనకు సమాచారం అందించారు. హాస్పిటల్‌లో కల్పనను చూసేందుకు వచ్చిన భర్తను పోలీసులు ముందుగా ఇంటికి తీసుకెళ్లి ప్రాథమిక విచారణ జరిపించారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకొని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కల్పనకు ఆమె కూతురు కి మధ్యన జరిగిన గొడవ కారణంగానే కల్పన ఇలాంటి దారుణమైన డెసిషన్ తీసుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. 

Read Entire Article