STUDDS Launches Ninja Comet Flip-Up Helmet: హెల్మెట్‌ మార్కెట్లో కొత్త చైతన్యాన్ని తెచ్చేందుకు STUDDS మరోసారి ముందుకు వచ్చింది. భారతీయ రైడర్ల కోసం రూపొందించిన Ninja Comet ఫ్లిప్‌-అప్‌ హెల్మెట్‌ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. కేవలం ₹1,420 ధరతో లభించే ఈ హెల్మెట్‌, సేఫ్టీతో పాటు స్టైల్‌గానూ కనిపిస్తోంది.

వాల్యూ సెగ్మెంట్‌లోకి STUDDS న్యూ ఎంట్రీ
STUDDS Accessories Ltd‌ ఇది వరకు ప్రీమియం రేంజ్‌లో అనేక మోడల్స్‌ విడుదల చేసింది. ఇది, వాల్యూ సెగ్మెంట్‌లో, ఈ కంపెనీ నుంచి వచ్చిన తొలి ఫ్లిప్‌-అప్‌ హెల్మెట్‌ కావడం ప్రత్యేకం. Ninja సిరీస్‌లో ఇది తాజా వేరియంట్‌. ఈ సిరీస్‌ 1995లో మొదలై ఇప్పటి వరకు పది వేర్వేరు మోడల్స్‌ను చూసింది.

డిజైన్‌ & సేఫ్టీ ఫీచర్లు
Ninja Comet హెల్మెట్‌ సన్‌వైజర్‌, స్పోర్టీ స్పాయిలర్‌ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. బరువు సుమారుగా 1,275 గ్రాములు మాత్రమే ఉండటంతో ఇది లైట్‌ వెయిట్‌ కేటగిరీకి చెందుతుంది. హెల్మెట్‌ బాడీని హై-ఇంపాక్ట్‌ గ్రేడ్‌ ఔటర్‌ షెల్‌తో తయారు చేశారు. అలాగే, రెజ్యులేటెడ్‌ డెన్సిటీ EPS లేయర్‌తో సేఫ్టీని పెంచారు.

రైడర్ల సౌకర్యం కోసం
హెల్మెట్‌ నుంచి ఊడదీయగలిగే, కడగగలిగే చెక్‌ ప్యాడ్స్‌తో పాటు హైపో అలర్జెనిక్‌ లైనర్‌తో కొత్త Ninja Comet ఫ్లిప్‌-అప్‌ హెల్మెట్‌ వచ్చింది. వేసవి లేదా తేమ ఉన్న వాతావరణంలో ఎక్కువ సేపు ధరించేందుకు ఇది సౌకర్యంగా ఉంటుంది. హెల్మెట్‌లో క్విక్‌ రీలీజ్‌ వైజర్‌ సిస్టమ్‌, ఏరోడైనమిక్‌ స్పాయిలర్‌, సన్‌వైజర్‌ ప్రొటెక్షన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ సర్టిఫికేషన్‌ & లభ్యత
ఈ హెల్మెట్‌ BIS సర్టిఫికేషన్‌తో పాటు ISI మార్క్‌ను కలిగి ఉంది. అంటే ఇది ఇండియన్‌ సేఫ్టీ నార్మ్స్‌కు పూర్తిగా అనుగుణంగా ఉంటుంది. Ninja Comet ఐదు రంగుల్లో, వివిధ సైజ్‌ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది. బైక్‌ లేదా స్కూటర్‌ రైడర్లు దీనిని దీనిని ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్స్‌లో, STUDDS ఎక్స్‌క్లూజివ్‌ ఔట్‌లెట్లలో, అలాగే shop.studds.com వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. త్వరలో ఇతర ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో కూడా ఈ నయా హెల్మెట్‌ అందుబాటులోకి రానుంది.

కంపెనీ నేపథ్యం
STUDDS ప్రస్తుతం మూడు మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్లను నడుపుతోంది, ఏడాదికి 90.4 లక్షలకు పైగా హెల్మెట్లు తయారు చేసే సామర్థ్యం ఈ మూడు యూనిట్లకు ఉంది. FY2024లో ఈ కంపెనీ 71 లక్షల యూనిట్లు (హెల్మెట్లు) విక్రయించింది. ఈ కంపెనీ ఉత్పత్తులు STUDDS & SMK పేర్లతో 70కి పైగా దేశాల్లో అమ్ముడవుతున్నాయి.

హెల్మెట్‌ మార్కెట్‌ పెరుగుదల
భారతదేశంలో టూ-వీలర్‌ వినియోగం పెరగడంతో పాటు హెల్మెట్‌ పరిశ్రమ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు వినియోగదారులు తక్కువ ధరలో సేఫ్టీతో కూడిన మోడల్స్‌ను ఇష్టపడుతున్నారు. STUDDS, Steelbird, Vega లాంటి కంపెనీలు మార్కెట్‌లో ప్రధాన స్థానంలో ఉన్నప్పటికీ... MT, LS2, Royal Enfield వంటి అంతర్జాతీయ బ్రాండ్లు కూడా పోటీలో ఉన్నాయి.

రహదారి భద్రతపై అవగాహన పెరగడం, హెల్మెట్‌ చట్టాల కఠిన అమలు & యూజర్ల ఆదాయం పెరగడంతో హెల్మెట్‌ మార్కెట్‌ మరింత విస్తరిస్తోంది. ఈ కొత్త Ninja Comet ఫ్లిప్‌-అప్‌ హెల్మెట్‌ మాత్రం సామాన్యులు కూడా భరించగలిగే ధర స్థాయిలోనే సేఫ్టీ & స్టైల్‌ను కలిపి అందిస్తోంది.