Satyabhama Serial Today Episode:  సత్య ప్లాన్‌ వర్కవుట్‌ అయిందని సంతకం చేయడానికి పది మంది దొరికేశారని క్రిష్‌ మనసులో అనుకుంటాడు. ఈరోజు ఎలాగైనా సంపంగితో ఎంజాయ్‌ చేయాలని మనసులో అనుకుంటాడు. ఇంతలో సత్య వచ్చి క్రిష్‌కు షాక్‌ ఇస్తుంది.

క్రిష్‌: ఈ సంతోషమంతా నాది కదా నేను కష్టపడ్డాను కదా అయితే ఒక్కడినే ఎంజాయ్ చేయాలి

సత్య: నేను ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాను కదా..? ఈ ఎలక్షన్‌ అంతా అయిపోయే వరకు.. అందులో నాకు అందరూ సాయం చేసే వరకు మన మధ్య ఈ దూరం ఉండాలి.

అని సత్య చెప్పగానే.. క్రిష్‌ డల్లు అయిపోతాడు. మౌనంగా అమాయకంగా చూస్తూ ఉండిపోతాడు. మరునాటి ఉదయం అందరూ నిద్ర లేచి వెంటనే.. నామినేషన్స్ వేయడానికి మహదేవయ్య కుటుంబం రెడీ అవుతుంది. మహదేవయ్యాను ఊరేగింపుగా నామినేషన్స్ కు తీసుకెళ్లాలని రుద్ర ప్లాన్ చేస్తాడు. భైరవి వీర తిలకం దిద్ది హారతి ఇవ్వాలని అనుకుంటుంది.

మహదేవయ్య: భైరవి నువ్వు కాదు.. నాకు చిన్న కోడలు హారతి ఇస్తేనే విజయం సాధిస్తాను.

సత్య: ఇదే మీ ఓటమికి తొలి అడుగు

అని మనసులో అనుకుంటూ హారతి ఇచ్చి వీర తిలకం దిద్దుతుంది.

భైరవి: నీవల్ల నా పెనిమిటికీ హారతి కూడా ఇవ్వలేకపోయాను. నీవల్ల అందరి దృష్టిలో నేను శత్రువుని అయిపోయాను హారతి కూడా ఇవ్వలేకపోయాను.

అని కోపంగా భైరవి, సత్యను మనసులో తిట్టుకుంటుంది. ఇక మహదేవయ్యను ఊరేగిస్తూ బయటకు తీసుకెళ్తారు.

బైరవి: నీతోపాటి నీ పక్కన ఊరేగింపుకు నేను వస్తాను.

మహదేవయ్య: సత్యకు నామినేషన్స్ లో సంతకం చేయడానికి వెళుతూ నాతో ఎలా వస్తావు.

అంటూ మహదేవయ్య అనగానే భైరవి షాక్‌ అవుతుంది. తర్వాత మహదేవయ్యను చాలా గ్రాండ్‌ గా నామినేషన్ష్ వేయడానికి తీసుకెళ్తారు. నామినేషన్స్‌ వేసే ఆఫీసు దగ్గరకు రెండు ఫ్యామిలీలు చేరుకుంటాయి. సత్య ఫ్యామిలీని చూసిన భైరవి తన మాటలతలో వాళ్లను బాధపెడుతుంది. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ మొదలవుతుంది. చిన్న గొడవ పెద్దగా మారుతుందని గమనించిన ఆఫీసర్లు వచ్చి మీలో మీరు గొడవలు పడితే మొత్తం ఎన్నికలనే ఆపేస్తామని వార్నింగ్‌ ఇస్తారు. దీంతో అందరూ సైలెంట్‌ అయిపోతారు. తర్వాత నరసింహ కోపంగా వెటకారంగా మహదేవయ్యను తిడుతుంటాడు.

నరసింహ: ఇంట్లో ఉన్న నీ కోడలే పోటీగా దిగుతుంది అంటే నువ్వు ఎలాంటి వాడివో జనాలకు తెలుస్తుంది నీ కోడలినే ఉద్ధరించలేని వాడివి జనాలను ఏం ఉద్దరిస్తావు.

సత్య: ఇది మా ఇంట్లో గొడవ మీకు అవసరం లేదు.

మహదేవయ్య: రేయ్‌ నరసింహం ఎక్కువ మాట్లాడుతున్నావు. క్రిష్‌ వాడి అంతు చూడు..

సత్య: క్రిష్‌ నువ్వు ఆగు… ఆవేశం వద్దు..

అంటూ సత్య ఆపడంతో క్రిష్‌ ఆగిపోతాడు. దీంతో రుద్ర కోపంగా క్రిష్‌ను చూస్తూ.. నీ పెళ్లాం చెప్పిందని ఆగిపోతావా..? బాపు మాట అంటే నీకు లెక్కలేదా.? అంటూ ఆవేశంతో ఊగిపోతుంటాడు. తన మాటలతో రుద్ర, క్రిష్‌ను రెచ్చగొట్టి నరసింహం మీదకు గొడవకు వెళ్లేలా చేయాలని మాట్లాడతాడు. అయినా క్రిష్‌ ఎక్కడా రెచ్చిపోకుండా సంయమనం పాటిస్తుంటాడు. ఇంతలో ఆఫీసర్లు వచ్చి నామినేషన్‌ పేపర్లు సబ్మిట్‌ చేయడానికి రండి అని పిలుస్తాడు. దీంతో అందరూ కలిసి నామినేషన్స్‌ వేయడానికి ఆఫీసు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్లిన మహదేవయ్య సత్యను చూస్తూ నువ్వు నామినేషన్‌ వేయడానికి నీతో పది మంది లేరు కదా అంటాడు. ఒకసారి అటూ చూడండి మామయ్య అంటుంది సత్య. అందరూ అటు చూడగానే ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!