సంయుక్తా మీన‌న్ త‌ర్వాత ఆభామ‌లిద్ద‌రే!

1 month ago 5
ARTICLE AD

సినిమా వేదికలపై స్టార్ హీరోల డైలాగులు చెప్పడం అనేది  గ్లామరస్ ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ , డైలాగులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో `భీమ్లా నాయక్` సమయంలో సంయుక్తా మీనన్ పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ డైలాగులను చెప్పి అభిమానులను అలరించారు. తాజాగా ఈ జాబితాలోకి యంగ్ స్టార్స్ శ్రీలీల , రాశీ ఖన్నా కూడా చేరడం విశేషం.

నిజానికి పబ్లిక్ వేదికలపై పవన్ కళ్యాణ్ డైలాగులు చెప్పాలంటే? కచ్చితంగా ఆ హీరోయిన్లకు ఆ హీరోపై అమితమైన గౌరవం , క్రేజ్ ఉండాలి. `ఉస్తాద్ భగత్ సింగ్`  వేడుక సమయంలో శ్రీలీల తనదైన ఎనర్జీతో పవన్ ఫేమ‌స్  డైలాగ్ తో అద‌ర‌గొట్టగా? రాశీ ఖన్నా కూడా పవన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా పబ్లిక్ ఈవెంట్లలో ఆయన డైలాగులను రీ-క్రియేట్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. ఇలా అగ్ర హీరోయిన్లు పవన్ కళ్యాణ్ డైలాగులను ఓన్ చేసుకోవడం అనేది సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ ముగ్గురు భామలు సంయుక్తా మీనన్, శ్రీలీల,  రాశీ ఖన్నా మాత్రమే పబ్లిక్ వేదికలపై పవన్ కళ్యాణ్ డైలాగులను ధైర్యంగా, ఎంతో పాజిటివ్ గా చెప్పిన హీరోయిన్లుగా గుర్తింపు పొందారు. ఇది పవన్ కళ్యాణ్ కేవలం ఒక హీరోగానే కాకుండా, హీరోయిన్లలో కూడా ఒక పవర్‌ఫుల్ ఐకాన్‌గా ఎలా నిలిచారో చాటిచెబుతోంది.  `ఉస్తాద్ భగత్ సింగ్` విడుదల సమయంలో మరి కొంతమంది హీరోయిన్లు, లేడీ అభిమానులు కూడా ఈ ట్రెండ్‌ను ఫాలో అయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

 

 

 

 

 

Read Entire Article