స‌ల్మాన్ ఖాన్ అలాంటి సాహ‌సం చేస్తారా

1 month ago 2
ARTICLE AD

దాదాపు 25 ఏళ్ల క్రితం విడుద‌లైంది సేతు(1999). ఈ సినిమాలో విక్ర‌మ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించాడు. క‌ల్ట్ క్లాసిక్ జాన‌ర్ లో విశేష ఆద‌రణ పొందిన ఈ చిత్రం ఆ త‌ర్వాత తెలుగులో రాజ‌శేఖ‌ర్ క‌థానాయ‌కుడిగా `శేషు` పేరుతో రీమేక్ చేయ‌గా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కురిసాయి. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించేందుకు ఇప్పుడు స‌ల్మాన్ ఖాన్ - సాజిద్ ఖాన్ బృందం సిద్ధ‌మ‌వుతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఈ సినిమా సీక్వెల్ కోసం క‌థ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని, శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లాల‌ని స‌ల్మాన్ భావిస్తున్నాడ‌ని ప్ర‌చార‌మైంది. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమా సీక్వెల్ గురించి సాజిద్ నడియాడ్ వాలా, ఇంకా స‌ల్మాన్ తో మాట్లాడ‌లేదు. బ‌య‌ట త‌ప్పుడు స‌మాచారం వ్యాప్తి చెందుతోంద‌ని టీమ్ తెలిపింది. స‌ల్మాన్ - సాజిద్ ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నారని సాగుతున్న ప్ర‌చారంపైనా స‌రైన‌ క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు.

తేరే నామ్ అనేది కాలాతీత ప్రేమ గాథ అని, అలాంటి క్లాసిక్‌ను తాకకూడదని సాజిద్ నమ్ముతున్నారు. ఖచ్చితంగా తన స్నేహితుడు సల్మాన్ ఖాన్‌తో మరో సినిమా చేస్తాడు కానీ ... అది తేరే నామ్ సీక్వెల్ కాదు. ఒక‌వేళ కిక్ 2 కోసం క‌లిసి ప‌ని చేస్తార‌ని కూడా సోర్స్ చెబుతోంది. సాజిద్ ప్ర‌స్తుతం త‌న కుమారుడిని క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.

Read Entire Article