ARTICLE AD
సక్సెస్ లుంటే కొత్త అవకాశాలకు కొదవుండదు. విజయవంతమైన చిత్రంలో భాగమైందంటే? వెంట వెంటనే రెండు మూడు కొత్త సినిమాలకు సైన్ చేసే ఛాన్సులొస్తాయి. పారితోషికం పరంగా డిమాండ్ కు అవకాశం ఉంటుంది. కానీ మెహరీన్ పిర్జాదా మాత్రం సక్సెస్ ఉన్నా? కొత్త అవకాశాలు ఒడిసి పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. `కృష్ణగాడి వీరప్రేమ గాధ` సినిమాతో అమ్మడు టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
తొలి సినిమా ప్లాన్ అయినా? అమ్మడు అందం, అభినయంతో కొత్త ప్రాజెక్ట్ ల్లో ఛాన్స్ లందుకుంది. అటుపై `మహానుభావుడు`, `రాజా ది గ్రేట్` తో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకుంది. కొన్ని వైఫల్యాల అనంతరం మళ్లీ `ఎఫ్ 2` విజయంతో సంచలనంగా మారింది. అందులో ఏకంగా హీరోలనే డామినేట్ చేసే పాత్రలో ప్రేక్షకుల్ని అలరించింది. దీంతో `ఎఫ్ 3` లో కూడా అదే భామను హీరోయిన్ గా రిపీట్ చేసారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి.
ఇన్ని విజయాలున్నా? `ఎఫ్ 3` తర్వాత మాత్రం కొత్త అవకాశాలు అందుకోవడంలో విఫలమైంది. ఈ సినిమా అనంతరం ఓ చిన్న చిత్రంలో మినహా స్టార్ చిత్రంలో ఛాన్స్ అందుకోలేదు. అప్పటి నుంచి మోహరీన్ టావీవుడ్ లో కనిపించలేదు. అనంతరం `ఇంద్ర` అనే ఓ తమిళ చిత్రంలో నటించింది. అప్పటికే కోలీవుడ్ లో లాంచ్ అయినా? అక్కడ సరైన అవకాశాలు రాలేదు. బిగ్ స్టార్స్ ఎవరి సరసన కనపించలేదు.
తాజాగా అమ్మడు కన్నడలో లాంచ్ అవుతుంది. `నీ సిగు వెరుగ్` అనే చిత్రంలో నటిస్తోంది. దీంతో సౌత్ లో మూడు భాషల్ని టచ్ చేసిన మరో నాయికగా మారింది. ఇక మాలీవుడ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. అక్కడా అదృష్టాన్ని చెక్ చేసుకుంటే ఓ పనైపోతుంది.

18 hours ago
1