షూటింగ్ లో గాయపడిన హీరో కార్తీ

9 months ago 7
ARTICLE AD

కోలీవుడ్ హీరో కార్తీ షూటింగ్ సెట్ లో గాయపడిన విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మైసూర్‌లో  జరుగుతున్న సర్ధార్ 2 షూటింగ్ సెట్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణలో కార్తి ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కార్తీని సమీపంలోని ఆసుపత్రికి తరలించింది చిత్ర బృందం. 

కార్తీ గాయం నుండి పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఒక వారం రోజులు పడుతుంది అని అందుకే ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దానితో యూనిట్ సినిమా షూటింగ్‌ను నిలిపివేసి మైసూర్ నుంచి చెన్నైకి తిరిగి వచ్చేసింది. కార్తీ గాయం నుండి కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నారు. 

ప్రస్తుతం సర్దార్ 2 కి సంబంధించి కార్తీ మరియు ఎస్.జె. సూర్య లపై దర్శకుడు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అంతలో ఈ ప్రమాదం షూటింగ్ కి బ్రేకిచ్చేలా చేసింది. 

Read Entire Article