ARTICLE AD
అక్కినేని నాగార్జున ఇంటికి కోడలిగా అడుగుపెట్టిన హీరోయిన్ శోభిత దూళిపాళ్ల రీసెంట్ గానే తన ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరిని సెలెబ్రేట్ చేసుకుంది. నాగ చైతన్య ను ప్రేమ వివాహం చేసుకున్న వెంటనే హైదరాబాద్ ని చుట్టేయ్యాలనుకున్నా.. కానీ నా షూటింగ్ వలన నేను తమిళనాడులో ఉండిపోవాల్సి వచ్చింది అంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
తమ తమ షూటింగ్స్ వలన తాను తమినాడులో, చైతు హైదరాబాద్ ఉండాల్సి వచ్చింది, తన షూటింగ్ వల్ల ఎక్కువగా పెళ్లి తర్వాత హైదరాబాద్ లో ఉండలేకపోయాను అంటూ చెప్పిన శోభిత దూళిపాళ్ల తాజాగా వదిలిన పిక్స్ చూస్తే యువరాణిలా రాజసం ఉట్టిపడేలా కనిపించింది.
అంతేకాదు శోభిత దూళిపాళ్ల బ్రైడల్ లుక్ లో కనిపించింది. హెవీ గౌన్ లో తలపై చున్నీ తో శోభిత చాలా ట్రెడిషనల్ గా ఆకట్టుకుంది. నాగార్జునకి కోడలిగా, చైతు కి భార్యగా శోభిత ఎప్పటికప్పుడు హైలెట్ అవ్వడమే కాదు, సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ తోనూ తన ప్రత్యేకతను చాటుతుంది.

2 days ago
2