వెంకీ-రానా లకు నాంపల్లి కోర్టు షాక్

1 month ago 2
ARTICLE AD

దగ్గుబాటి హీరోలకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్‌ భూమి వివాదంలో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై పర్సనల్‌ బాండ్‌ సమర్పించాల్సి ఉంటుంది అంటూ దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్, రానా లకు కోర్టు షాకిచ్చింది. నందకుమార్‌ అనే వ్యక్తి, దక్కన్ కిచెన్‌ స్థలంపై కోర్టుకెళ్లాడు. 

ఈ కేసు వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటుంది. అయితే కోర్టులో ఈ కేసు ఎన్నిసార్లు విచారణకు వచ్చినా.. సురేష్ బాబు, వెంకటేష్, రానాలు కోర్టుకు హాజరవలేదు, ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా వారు కోర్టుకు రాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈసారి ఖచ్చితంగా పర్సనల్‌ బాండ్‌ సమర్పించేందుకు సురేష్ బాబు, వెంకటేష్, రానా లు నవంబర్ 14న నాంపల్లి కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలి అని ఆదేశాలు జారీ చేసింది. మరి దగ్గుబాటి హీరోలు ఈసారి కోర్టు ఆదేశాలను ఎంతవరకు పాటిస్తారో చూడాలి. 

Read Entire Article