వీరమల్లు కథే వేరు: క్రిష్

3 months ago 3
ARTICLE AD

దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు విషయాలు చెప్పకుండా తప్పించుకుందామన్నా ఘాటీ ప్రమోషన్స్ లో ఆయన్ని వీరమల్లు ప్రశ్నలు వదలడం లేదు. వ్యక్తిగత కారణాలతో షెడ్యూల్స్ లేట్ అవడం వల్లే వీరమల్లు నుంచి బయటికి వచ్చాను అని చెప్పిన క్రిష్ తాజాగా ఘాటీ ప్రమోషన్స్ లో వీరమల్లు విషయాలు పంచుకున్నారు. 

హరి హర వీరమల్లు కోసం ఓ 40 నిమిషాల నిడివి గల ఫుటేజ్ ని నేను చిత్రీకరించాను, నేను రాసుకున్న కథ కు సంబందించిన చిత్రీకరణ దర్బార్లో జరుగుతుంది. దీనికోసం నిర్మాత రత్నం రాజీపడకుండా అన్నపూర్ణ స్టూడియోస్లో భారీ సెట్ వేశాం. మేం తెరకెక్కించిన సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. ఔరంగజేబు దిల్లీ వెళ్లిన తర్వాత కథను చిత్రీకరించాం. 

అంతేకాకుండా పవన్ కల్యాణ్ అద్భుతమైన స్టంట్స్ చేశారు. కోహినూర్ దొంగిలించిన తర్వాత ఆయన మయూర్ సింహాసనం మీద నిల్చోవడం, ఔరంగజేబుకు సవాలు విసరడం, కోర్టుకు వెళ్లడం.. ఇలా చాలా సన్నివేశాలని చిత్రీకరించాం. హరి హర వీరమల్లు 2 లో  నేను తీసింది 40 నిమిషాలు ఫుటేజ్ ఉంటుంది. పవన్ అంటే నాకు చాలా ఇష్టం. 

హరి హర వీరమల్లు కోసం ఐదేళ్లు ఎదురు చూసాను, చిత్రీకరణ సమయంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది. అనేక కారణాల వల్ల షెడ్యూళ్లు ఆలస్యమయ్యాయి. పవన్ చాలా గొప్ప వ్యక్తి అంటూ క్రిష్ ఘాటీ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు. 

Read Entire Article