వి వి వినాయక్ హెల్త్ పై టీమ్ క్లారిటీ

9 months ago 7
ARTICLE AD

దర్శకుడు వి.వి వినాయక్ కొన్నాళ్లుగా బయట కనిపించడం లేదు. ఆయనేదో అనారోగ్యంతో  బాధపడుతున్నారు అంటూ వార్తలు రావడమే కాదు, వినాయక్ ని రీసెంట్ గా చూసినవాళ్లు కూడా అదే అంటారు. ఆయన బాగా బరువు తగ్గి నీరసంగా కనిపించడంతో వినాయక్ హెల్త్ పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

తాజాగా దర్శకుడు వినాయక్ ఆరోగ్యం పై కొన్ని సాంఘీక మాధ్యమాలలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా వున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలి అని మనవి. ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకొనబడును అంటూ వినాయక్ టీమ్ స్పందించింది. 

ప్రస్తుతం వినాయక్ ఆరోగ్యంగా ఉన్నారు అంటూ ఆయన టీమ్ స్పందించడంతో మాస్ ఆడియన్స్, వినాయక్ అభిమానులు రిలాక్స్ అవుతున్నారు. వినాయక్ కు మాస్ దర్శకుడిగా ఓ వర్గం ఆడియన్స్ లో ఒకప్పుడు ఫుల్ క్రేజ్ ఉండేది. ప్రస్తుతం ఆయన సినిమాలేవీ తెరకెక్కించడం లేదు. 

 

Read Entire Article