ARTICLE AD
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్-టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కలయికలో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 చిత్ర షూటింగ్ చకచకా ముగించేస్తున్నారు. ఈపాటికే వార్ 2 షూటింగ్ కంప్లీట్ కావాల్సి ఉన్నప్పటికి చిన్న చిన్న కారణాలతో షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. ఇక ఆగష్టు లో వార్ 2 రిలీజ్ అని ఎప్పుడో ప్రకటించారు మేకర్స్.
తాజాగా వార్ 2 రైటర్ అబ్బాస్ వార్ 2 పై ఇచ్చిన క్రేజీ అప్ డేట్ ఇప్పుడు క్షణాల్లో వైరల్ అయ్యింది. వార్ 2 షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఆగష్టు 25 న వార్ 2 విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఆరోజు హృతిక్ రోషన్-ఎన్టీఆర్ ని థియేటర్స్ లో కలుద్దాం, వార్ 2 డైలాగ్స్ అన్ని నేనే రాసాను.
వార్ 2 డైలాగ్స్ అన్ని మీకు నచ్చుతాయి.. అంటూ రైటర్ అబ్బాస్ ఇచ్చిన అప్ డేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఉత్సాహాన్నిచ్చింది. అన్నట్టు ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ కూడా ఈరోజు నుంచే భారీ యాక్షన్ సీక్వెన్స్ త మొదలు కావడం ఎన్టీఆర్ అభిమానులకు మరొక ట్రీట్ అనే చెప్పాలి.

9 months ago
7