వరస వివాదాల్లో నలిగిపోతున్న దీపికా

1 month ago 3
ARTICLE AD

బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొనె వరస వివాదాల్లో కూరుకుపోతుంది. సందీప్ వంగ దీపికా డెడికేషన్ ను శంకిస్తూ ఆమెను పాన్ ఇండియా మూవీ స్పిరిట్ నుంచి తప్పించడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఆ తర్వాత ప్రభాస్ మరో భారీ పాన్ ఇండియా ఫిలిం కల్కి 2 నుంచి కూడా మేకర్స్ దీపికా పదుకొనే ను తప్పించారు. 

దీనంతటికి కారణం ఆమె డిమాండ్స్, పని వేళల్లో కండిషన్స్ పెట్టడం వలనే ఆమెను ఆ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పించారని అన్నారు.  తాజాగా దీపికా పదుకొనె మరో వివాదంలో చిక్కుకుంది. రీసెంట్ గా దీపికా పదుకొనె తన భర్త రణ్వీర్ సింగ్ తో కలిసి అబుదాబి టూరిజం కోసం చేసిన డ్రెస్సింగ్ విషయంలో వివాదం చోటు చేసుకుంది. ర‌ణ్వీర్ సింగ్, దీపికా ప‌దుకొనె క‌లిసి అబుదాబి దేశాన్ని ప్ర‌మోట్ చేయ‌టానికి చేసిన టూరిజం యాడ్‌లో ఇద్ద‌రూ న‌టించారు.

ఆమె ఇండియాలో దేవాలయాలకి వెళ్ళినపుడు కనీస జాగ్రత్తలు కూడా పాటించలేదు. అదే ఆమె అబుదాబి లో మాత్రం సంస్కృతీ సంప్రదాయాలు పాటిస్తూ హిజాబ్ ధ‌రించ‌టం ఏమిటి. హిజాబ్‌ను ముస్లిం మ‌హిళ‌లు ధ‌రిస్తుంటారు. హిందు మ‌హిళ‌వి అయ్యిండి హిజాబ్ ధ‌రించ‌డం ఏంటి అంటూ దీపికా ప‌దుకొనెను ఉద్దేశించి నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు. 

యాడ్‌లో న‌టించ‌ట త‌ప్పు కాదు. హిందూ ధ‌ర్మాన్ని, విలువ‌ల‌ను కించ‌ప‌రిచేలా చేయ‌టం క‌రెక్ట్ కాదంటూ బాలీవుడ్ సినీజనాలే దీపికా పదుకొనె ను టార్గెట్ చేస్తున్నారు. 

Read Entire Article