రేసింగ్ లో అజిత్ కారుకు పెను ప్రమాదం

9 months ago 7
ARTICLE AD

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈమధ్యన కార్ రేసింగ్ లో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. దుబాయ్‌లో గ్రాండ్ ప్రాక్టీస్ రేస్ కోసం సాధ‌న చేస్తున్న స‌మ‌యంలో అజిత్ కారు ప్ర‌మాదానికి గురైన విష‌యం తెలిసిందే.. తాజాగా అజిత్ కార్ కి మరోసారి పెను ప్రమాదం జరగడం ఆయన అభిమానులకు షాకిచ్చింది. ప్రస్తుతం స్పెయిన్‌లో జ‌రుగుతున్న రేసింగ్‌లో అజిత్ కారు ప్ర‌మాదానికి గురైంది. 

అజిత్ కారు రేసింగ్ ట్రాక్‌పై ప‌ల్టీలు కొట్టింది. ప్రాక్టీస్ రేసులో భాగంగా మరో కారును త‌ప్పించే క్ర‌మంలో అజిత్ కారుకు ఈ ప్ర‌మాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు పల్టీలు కొట్టగానే ఆ కారులోంచి అజిత్ సుర‌క్షితంగా బ‌య‌ట‌కు రావ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ యాక్సియెంట్ కు సంబంధించిన వీడియోను అజిత్ రేసింగ్ టీమ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసింది. 

ఆ వీడియోలో అజిత్ సురక్షితంగా కనిపించడంతో అజిత్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక ఆ యాక్సిడెంట్ తర్వాత కూడా అజిత్ ప్రాక్టీస్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. 

Read Entire Article