Balapur Ganesh Laddu Auction: ₹35 Lakh Record-Breaking Bid.బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన లడ్డూ వేలం ప్రక్రియ ఈరోజు ముగిసింది. అంచనాలకు మించి ఈసారి లడ్డూ వేలంలో రికార్డు ధర పలికింది. కేవలం రూ. 1,116తో ప్రారంభమైన ఈ వేలం, మొత్తం 38 మంది భక్తుల మధ్య తీవ్ర పోటీకి దారి తీసింది. చివరికి, లింగాల దశరథ్ గౌడ్ అనే భక్తుడు ఏకంగా రూ. 35 లక్షల భారీ ధరకు లడ్డూను దక్కించుకున్నారు.