రాజా సాబ్‌కి అదే బ్యాలెన్స్

11 months ago 8
ARTICLE AD

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-మారుతి కాంబోలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ చిత్రం షూటింగ్ ఎక్కడివరకు వచ్చింది, ఏ మేర పూర్తయ్యింది అనే విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆతృతగా కనబడుతున్నారు. కారణం ఈ మధ్యన ప్రభాస్ కాలికి దెబ్బ తగలడంతో ఆయన కల్కి జపాన్ ప్రమోషన్స్‌కి వెళ్లలేకపోయారు, దానితో రాజా సాబ్ షూటింగ్ కూడా బ్రేక్ వచ్చిందేమో అనే అనుమానం ఫ్యాన్స్ లో ఉంది. 

రీసెంట్ గా ఓ ఈవెంట్‌లో ఈ సంక్రాంతికి రాజా సాబ్ నుంచి ఏమైనా అప్ డేట్ వుంటుందా అని యాంకర్ దర్శకుడు మారుతిని అడగగా.. దానికి మారుతి ఉంటే మేమే చెబుతామంటూ తప్పించుకున్నారు. ఇక రాజా సాబ్ కి సంబంధించి టాకీ పార్ట్ పూర్తయిందట.. కేవలం నాలుగు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని చెబుతున్నారు. 

ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి ముగ్గురు హీరోయిన్స్ తో  మూడు డ్యూయెట్లు ఉంటాయి. మరో సాంగ్ లో ముగ్గురితో ప్రభాస్ ఆడిపాడనున్నట్లుగా తెలుస్తోంది.

Read Entire Article