రాజమౌళికి లాజిక్కులతో పని లేదు

9 months ago 8
ARTICLE AD

పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి పై బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ చేసిన కామెంట్స్ నెట్టింట సంచలనంగా మారాయి. క‌ర‌ణ్ జోహార్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. కొంతమంది డైరెక్టర్స్ కి లాజిక్కులతో పని లేదు, కథపై నమ్మకం పెట్టుకుంటారు అందులో ప్రత్యేకించి రాజ‌మౌళి, సందీప్ రెడ్డి వంగా, అనిల్ శ‌ర్మ రూపొందించిన RRR, యానిమ‌ల్‌, గ‌దర్ వంటి సినిమాలు అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పారు. 

కొన్ని సినిమాలు లాజిక్కులు పని చేసినా కొన్ని సినిమాలకు లాజిక్కులతో పని లేకుండా నమ్మకం ఆధారంగానే హిట్ అవుతాయి. రాజమౌళి తీసిన సినిమాలే తీసుకోండి ఆయ‌న సినిమాల్లోని లాజిక్ ల గురించి ప్రేక్ష‌కులు ఎప్పుడూ మాట్లాడ‌రు. ఆయ‌న‌కు త‌న స్టోరీపై పూర్తి న‌మ్మ‌కం, విశ్వాసం ఉంటాయి.

ఎలాంటి సీన్ అయినా ప్రేక్ష‌కుల‌కు న‌మ్మ‌కం క‌లిగేలా తెర‌కెక్కించగ‌ల‌రు. సినిమా విజ‌యం పూర్తిగా న‌మ్మ‌కంపై ఆధార‌ప‌డి ఉంటుంది. లాజిక్ ల గురించి ఆలోచించ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌దు. సినిమాను కేవ‌లం వినోదం కోసం మాత్ర‌మే చూడాలి అంటూ కరణ్ జోహార్ రాజమౌళిపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 

Read Entire Article