ARTICLE AD
మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని అయితే అభివృద్ధి ఒక చోటే కేంద్రీకృతమై ఉంటుంది. అందుకే విశాఖ, అమరావతి, కర్నూల్ అంటూ మూడు రాజధానుల రాగం పాడి 2024 ఎన్నికల్లో ఓడిపోయాక మేము అమరావతికి వ్యతిరేఖం కాదు అంటూ భజన మొదలు పెట్టారు.
2024 ఎన్నికల్లో ఓడిపోయాక బెంగుళూరు-తాడేపల్లి షటిల్ సర్వీస్ చేస్తున్న జగన్ రెడ్డి తాజాగా రాజధాని డ్రామా అంటూ కొత్త కథ స్టార్ట్ చేసాడు. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్స్ తో కాలం గడిపే జగన్ ఈరోజు రాజధానిపై పెట్టిన ప్రెస్ మీట్ లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వరకూ కొత్త రాజధానిని ప్రకటించాలని.. దానికి MAVIGUN అని పేరు పెట్టాలని జగన్ డిమాండ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
అయితే మావిగన్ కు జగన్ సూచించిన అర్ధం ఏమిటంటే.. మచిలీపట్నంలో మొదటి రెండు అక్షరాలు, విజయవాడలోని మొదటి రెండు అక్షరాలు, గుంటూరులోని మొదటి మూడక్షరాలతో ఈ పేరు పెట్టాలని చెప్పుకొచ్చారు. ఐదేళ్లుగా మూడు రాజధానుల డ్రామాకు తెర లేపిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త రాగం అందుకోవడం ఏపీ ప్రజలకే కాదు అటు వైసీపీ నేతలకు, కార్యకర్తలకు కూడా నచ్చడం లేదు.
మరోపక్క పార్లమెంట్ లో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ జరుగుతుంది. అదే సమయంలో పార్లమెంట్ నుంచి వైసీపీ ఎంపీలు వాకౌట్ చేసారు.

2 weeks ago
3