రాకాశి అల‌ల ఎదుట‌ మ‌హేష్ అడ్వెంచ‌ర్

1 month ago 2
ARTICLE AD

పెను తుఫాను త‌లొంచి చూసే తొలి నిప్పు క‌ణం అత‌డే...!!  ఇక్క‌డ సూప‌ర్ స్టార్ మ‌హేష్ అడ్వెంచ‌ర్ చూస్తుంటే, క‌చ్ఛితంగా `అత‌డు` సినిమాలోని పాట‌ను గుర్తు చేసుకోవాల్సి వ‌స్తోంది. ఓవైపు రాకాశి అల‌లు విరుచుకుప‌డుతుంటే స‌ముద్రంలోకి దిగి ఎలా ధైర్యంగా నుంచున్నాడో చూస్తున్నారా?

సిస‌లైన సాహ‌స యాత్రికుడిగా అడ్వెంచ‌ర‌స్ మూవీలో న‌టించ‌డ‌మే కాదు.. నిజ జీవితంలో కూడా అంతో ఇంతో సాహ‌సం చేసే తెగువ ధైర్యం కావాలని నిరూపిస్తున్నాడు ఎంబీ. అస‌లే మ‌నోడు టామ్ క్రూజ్ అభిమాని క‌దా!  మిషన్ ఇంపాజిబుల్ విన్యాసాల‌ను రాజ‌మౌళి సినిమా కోసం ప్ర‌యత్నిస్తున్నాడో ఏమో కానీ, ఇప్పుడు స‌ముద్రంలో అత‌డు ఇలాంటి ఫీట్ తో క‌నిపించ‌డం అభిమానుల్లో గుబులు పుట్టిస్తోంది.

ఈ క్లిక్ చూడ‌గానే ఒక‌టే కంగారు..! స‌ముద్రంలో బ‌స ఏర్పాటు చేసినంత మాత్రాన‌, మ‌రీ ఇంత‌గా సాహ‌సం చేయాలా? అంటూ అభిమానులు భ‌య‌ప‌డిపోతున్నారు. త‌న‌కు అద్భుత‌మైన బ‌స ఏర్పాటు చేసినందుకు అఖండ‌మైన ఆనందం క‌లిగింద‌ని మ‌హేష్ ఈ ఫోటోగ్రాఫ్ ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి చెబుతున్నాడు. కానీ ఇలా చేయ‌డానికి చాలా గుండె ధైర్యం కావాలి. అల‌లు ఎగ‌సిప‌డే చోట సాహ‌సాలేంటి గురూ?  ఓ వైపు ఏపీలో మోంతా తుఫాన్ గురించి మాట్లాడుకుంటుంటే, మ‌హేష్ అదేమీ ప‌ట్ట‌న‌ట్టు ఇలా చేస్తున్నాడేంట‌బ్బా!

Read Entire Article